ప్రేమ, ఆకర్షణ.. రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎలాగంటే..!

Publish Date:Jan 5, 2024

Advertisement

ప్రేమ,  ఆకర్షణ రెండు వేర్వేరు విషయాలు కాదు.  ప్రేమను,  ఆకర్షణను సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రేమ అనేది  మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణతోనే మొదలవుతుందని అర్థమవుతుంది.  ఇది ఒకే దారిలో రెండు స్టాపింగ్ పాయింట్స్ లాంటిది. ఈ దారిలో వెళ్లే   కొందరు వ్యక్తులు ప్రేమను చేరుకుంటే, కొందరు తమ సంబంధాన్ని కేవలం ఆకర్షణకే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆకర్షణ నుండి ప్రేమకు వెళ్ళడం సులభం కాదు. అందుకే రెండింటి మధ్య  తేడాను గుర్తించాలి.  ఎవరైనా.. ఎవరినైనా ప్రేమిస్తున్నట్టైతే ప్రేమలో ఉన్నారా లేదా ఆకర్షణలో ఉన్నారా అనే విషయం తరచి చూసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..

ఇతర విషయాల ప్రాధాన్యత..

ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు.  తన భాగస్వామిని కలిసిన ప్రతిసారీ తను మొదటి సారి కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీలవుతారు. కానీ సంబంధం కేవలం ఆకర్షణపై మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు కలిసి సమయాన్ని గడపడానికి కాస్త పరధ్యానం చూపిస్తారు.  

భవిష్యత్తు విషయాలు..

ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నవారు  తమ భవిష్యత్తును మరొకరితో గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ కలిసి ఉండేందుకు,  కలిసి తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు.   దాని కోసం కష్టపడతారు. కానీ ఆకర్షణలో ఉన్నవారు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలు వేయరు. వారు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ అలాంటి సందర్భం తీసుకుని వస్తే.. ఇప్పుడే అవన్నీ అవసరమా అంటూ సిల్లీగా వాటిని కొట్టేపడేస్తారు.  సరళంగా చెప్పాలంటే వారి భవిష్యత్తులో మీకు చోటు ఉండదు.

శారీరక సంబంధం..

ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం  అవసరాన్ని కలిగి ఉండదు. దీనిలో వ్యక్తులు ఒకరికొకరు మానసికంగా దగ్గరగా ఉంటారు. అయితే శారీరక సంబంధమే ఆకర్షణకు కేంద్ర బిందువు. ఒక  వ్యక్తి తన భాగస్వామి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా,   ఏమి కావాలో కూడా తెలుసుకోకుండా కేవలం వారి అవసరం కోసం మాత్రమే శారీరక సంబంధం గురించి మాట్లాడుతున్నట్టైతై వారు మీతో ఎక్కువ కాలం ఉండరు అనేది నిజం.

వ్యక్తిగత జీవితం గురించి రహస్యాలు..

ప్రేమలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి ముందు అద్దంలా మారతాడు. అతని తప్పులు, లోపాలు  లక్షణాలు, ఏదీ దాచరు. కానీ ఆకర్షణలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయానికి అందరమైన కథలు అల్లి మభ్యపెడతారు.

                                        *నిశ్శబ్ద.

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.