ఏపీలో పొత్తులపై పవన్ ఢిల్లీ నుండి క్లారిటీ ఇచ్చారా.. కన్ఫ్యూజ్ చేశారా?!

Publish Date:Jul 18, 2023

Advertisement

ఏపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రోజులు గడిచే కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది పొత్తులు, సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం. ఇవన్నీ కుదిరితేనే పొత్తులు ఖరారై ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. ఉమ్మడి మ్యానిఫెస్టోతో ప్రజల మధ్యకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఏపీలో మాత్రం నాలుగు నెలల నుండి ఈ పొత్తుల అంశం నాన్చివేత, సాగతీత ధోరణే సాగుతుంది. ఇదిగో తేలిపోతుంది అనుకునే లోపే ఎవరికి వారు ఆ ఊసే లేకుండా గడిపేస్తున్నారు. దీంతో ఒక దశలో ఇక పొత్తులు ఉండవని.. ప్రతిపక్షాలు పునరాలోచన చేస్తున్నాయనే ప్రచారం కూడా మొదలైంది.

కాగా, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తులపై క్లారిటీ ఇస్తారనే మరో ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఆయన ఢిల్లీలో జరిగే ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావడమే. జులై 18 మంగళవారం ఢిల్లీలో జరిగిన  విస్తృత స్థాయి సమావేశానికి బీజేపీ కొత్త మిత్రులతో పాటుగా తన నుండి విడిపోయిన పాత మిత్రులను కూడా పిలిచింది. అయితే, రాజకీయ వర్గాలు భావించినట్లే ఏపీ నుండి టీడీపీకి పిలుపు రాలేదు. అదే సమయంలో జనసేనకి  పిలుపు వచ్చింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్  హాజరయ్యారు. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు అయ్యాయి. ఇది బీజేపీ బల ప్రదర్శన అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. ఇలాంటి బలప్రదర్శన సమావేశానికి కూడా టీడీపీకి ఆహ్వానం అందించలేదు. మరోవైపు ఢిల్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని.. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. 2019లో విడివిడిగా పోటీ చేశామని.. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామన్నారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి.. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. పవన్ వ్యాఖలను చూస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ విడిగానే పోటీ చేస్తుందా? లేక పవన్ ఢిల్లీ నుండి పొత్తుల అంశంపై క్లారిటీతో ఏపీకి వస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీలో పవన్ వ్యాఖ్యలు, హావ భావాలు ఆయనలోని కన్ఫ్యూజన్ నే మరో సారి ఎత్తి చూపాయి. ఆయన తన కన్ఫ్యూజ్ ను అందరికీ  వ్యాపింప చేసేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒక రాజకీయ వర్గం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ ఎన్డీయే భేటీలో చాలా విషయాల మీద బీజేపీ పెద్దల నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటారని.. ఏపీలో పొత్తులు ఉండాలంటే జగన్ తో బంధాన్ని బీజేపీ వదులుకోవాలని కండిషన్ పెడతారని  తెలుస్తోంది. కానీ హస్తిన వేదికగా పవన్ మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఏం మాట్లాడారో, బీజేపీ పెద్దలు ఏం చెప్పారో స్పష్టతే  లేకుండా పోయింది. ఏపీలో పొత్తులు అంటే వైసీపీని దించే పొత్తులుగా ఉండాలని.. ఏపీలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీని కూడా కలుపుకుని పోతేనే అది సాధ్యపడుతుందని మొదటి నుండి పవన్  చెబుతూ వచ్చారు. వైసీపీ వ్యతిరేక  ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని చెబుతూ వచ్చారు. ఆ దిశగా బీజేపీ హై కమాండ్ ను ఒప్పిస్తాననీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేసింది లేదు కానీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం రాష్ట్రంలోని వైసీపీ  సర్కార్ కు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూనే వస్తోంది.  తాజాగా పవన్ కు ఢిల్లీలో  బీజేపీ పెద్దలతో కలిసిన తరువాత కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలోనే ఉన్నారని ఆయన మాటలద్వారానే అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.