తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి ధర్మారెడ్డి.. తేల్చి చెప్పిన కమిషన్ నివేదిక

Publish Date:May 2, 2026

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసుకు సంబంధంచిన ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది.  ఈ కమిషన్ నివేదిక  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వ్యవహారంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డే సూత్రధారి అని తేల్చింది.  ఆయనతోపాటు అప్పటి మరో అధికారి సింఘాల్, ఆర్థిక సలహాదారుడు, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ బాలాజీ, ప్రొక్యుమెంటర్ ఆఫీసర్లు జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు విజయ భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్రధారులని  ఏకసభ్య కమిషన్ నివేదిక పేర్కొంది.  

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.  వైఎస్  రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ధర్మారెడ్డి  టీటీడీ ఈవోగా  ఉండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను డిప్యూటేషన్ పై తెచ్చుకునిమరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు. ఇప్పుడు అదే అధికారి టిటిడి లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి కారణాలతోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో  వినియోగించిన నెయ్యిలో  కల్తీ జరిగిందని  ఏకసభ్య కమిషన్ నిర్థారించింది.
 
 2019 జూన్ లో అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే అంటే  జూలైలో నే ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టారు.  2022 మే వరకు అదే హోదాలో కొనసాగారు. ఆ తరువాత నుంచీ టీటీడీ ఈవోగా కొనసాగారు.  ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్నతరువాత..  నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలు సడలించారు. నెయ్యి సరఫరాదారుల అర్హతలు, విశ్వసనీయత, అనుభవం, సమర్థత, నాణ్యత హామీలు నిలబెట్టుకోవడం, పర్యవేక్షణ, తనిఖీలు వంటి వాటిని గాలికి వదిలేశారు.  ఫలితంగానే కల్తీ అయిన నెయ్యి టీటీడీలో ప్రవేశించిందని విచారణలో ఏకసభ్య కమిషన్ తేల్చింది. అంతే కాకుండా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పాలక మండలికి నెయ్యి సేకరణలో నిబంధనలను సడలించినవిషయాన్ని తెలియజేయలేదని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.   ఇప్పుడీ  కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  

By
en-us Political News

  
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.