దేవినేని నెహ్రూ మంచితనం, మరిచిపోలేని జాపకాలు
Publish Date:Apr 17, 2017
Advertisement
కృష్ణాజిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ చాలా మంచివారని ఆయన అనుచరులు చెబుతుంటారు. అందరినీ కలుపుకునిపోయే వ్యక్తని, తన సాయం కోరి వస్తే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా అండగా నిలబడతారని, అందుకోసం ఎంతకైనా తెగించి ముందుకెళ్తారని పేరు. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచీ నెహ్రూది ఇదే తత్వమని, నమ్మింది చేయడంలోనూ, అనుకున్నది సాధించడంలోనూ నెహ్రూ దృఢచిత్తగలవారని అంటుంటారు. స్టూడెంట్ పాలిటిక్స్ మొదలుకొని రాజకీయంగా బెజవాడ నగరాన్ని శాసించే స్థాయివరకూ ఎదిగిన నెహ్రూ... తనను నమ్ముకున్న వాళ్లకోసం, తన వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తారని అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. వంగవీటి ఫ్యామిలీని సమర్ధంగా ఢీకొట్టడంతో నెహ్రూ ఓ వర్గంలో హీరో అయ్యారు. అదే ఆయనకు ప్లస్‌గానూ మారింది. నెహ్రూ గుండె ధైర్మం గురించి ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. నెహ్రూ గుండె ధైర్యాన్ని చూసే ప్రత్యర్ధులు వణికిపోయేవారని, ఆయన్ను చూస్తేనే సగం గుండె జారిపోయేదని, అందుకే నెహ్రూను ఢీకొట్టాలంటే భయపడేవారని చెబుతారు. అంతేకాదు ఒక్క బెజవాడలోనే కాకుండా, కృష్ణాజిల్లా అంతటా నెహ్రూకి అనుచరగణం ఉండేదని, ఆయన్ను ప్రజలు అభిమానించేవారని, అదే ఆయనకు ఆయుధంగా కవచంగా మారిందని అంటారు. ఇక దేవినేని నెహ్రూ ప్రతి ఒక్కరినీ మర్యాదగా పిలుస్తారని చెబుతారు. తన అనుచరులను కూడా చిన్నవాళ్లయితే తమ్ముడని, తన కంటే పెద్దవాళ్లయితే అన్నయ్య అంటూ పలకరించేవారు. అంతేకాదు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా, నచ్చని విషయమైనా హుందాగా వ్యవహరిస్తారని దేవినేని నెహ్రూకి పేరుంది. వంగవీటి సినిమా సందర్భంగా దేవినేని నెహ్రూని పలుమార్లు కలిసిన డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ.... ఆయన మంచితనాన్ని కొనియాడారు. నమ్మింది చేయడంలో, అనుకున్నది సాధించడంలో నెహ్రూ... చాలా కచ్చితంగా ఉండేవారని వర్మ ట్వీట్ చేశారు. తాను కలిసిన ప్రతీసారి తనను ఎంతో మర్యాదగా చూసుకునేవారని, ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేవారని వర్మ గుర్తుచేసుకున్నారు.
http://www.teluguone.com/news/content/devineni-nehru-death-45-74019.html





