అంబులెన్స్ లో ప్రసవం

Publish Date:Apr 8, 2026

Advertisement

జనన, మరణాలు మన చేతిలో లేవు. కానీ కొన్ని సందర్భాల్లో 108 సిబ్బంది సమయస్ఫూర్తి, ధైర్యంతో ప్రాణం పోస్తారు. అంబులెన్సులోనే సుఖ ప్రసవాలు జరిగేలా చూస్తారు. అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.     ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి.

ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటన రాయచోటిలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున  ఓ గర్భిణీ ని మెరుగైన చికిత్స కోసం రాయచోటి ఏరియా హాస్పిటల్ నుండి కడప రిమ్స్ హాస్పిటల్ కి 108 అంబులెన్స్ లో తీసుకు వెళ్తున్న సమయంలో ఆమె కు నొప్పులు అధికమ య్యాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న అంబులెన్స్ సిబ్బంది ఈఆర్సిపి డాక్టర్ సింధుకు ఫోన్ చేసి విషయం   వివరించారు.

దీంతో డాక్టర్ సింధు సలహా మేరకు అంబులెన్స్ సిబ్బంది జయరామ్ అంబు లెన్స్ లోనే గర్భిణీకి ప్రసవం జరి పారు. ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.   బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అనంతరం ఆ మహిళకు ఐవి ఫ్లూయిడ్స్ అందిస్తూ శిశువుకు అవసరమైన ప్రాథమిక సంరక్షణ చేపడుతూ... తల్లి ,బిడ్డలను మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్ కి సురక్షితంగా తరలించారు.  

అయితే అప్పటికే అంబు లెన్స్ లో ప్రసవించిన మహి ళను చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవ హరించి ప్రసవం చేసిన 108 సిబ్బందిని అభినందించారు.  

By
en-us Political News

  
కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ​సుప్రీంకోర్టు ఆదేశించినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్ యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ​సాక్షులను బెదిరిస్తూ,డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.
డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన విజ్ణప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కనీసం 34 ఇరాన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. వీటిలో 19 నౌకలు గల్ఫ్ నుంచి వెలుపలికి, మరో 15 లోపలికి ప్రవేశించాయి. ఈ రవాణా ద్వారా ఇరాన్ దాదాపు 10.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విదేశాలకు తరలించినట్లు అంచనా.
దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది.
నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.
అసెంబ్లీ ఎన్నికల సమరం.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఈవీఎంలు, భద్రత కట్టుదిట్టం
రెంటు కట్టని వైనం.. కోహ్లీ వన్8 కమ్యూన్‌కు తాళాలు
హైదరాబాద్ మహానగరంలో వస్తువుల డెలివరీ విధానం పూర్తిగా మారబోతోంది.
ప్రస్తుత ఏడాది 2026 తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఊహించని మందగమనాన్ని నమోదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.