Delhi: తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్.!

Publish Date:Oct 5, 2026

Advertisement

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు. సోమవారం ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన అద్వైత్ కుమార్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెసిడెంట్ కమిషనర్ పదవికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1441, సాధారణ పరిపాలన (Spl.A) శాఖ, తేదీ 03.10.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

 అద్వైత్ కుమార్ సింగ్‌కు తెలంగాణ భవన్‌తో ఇప్పటికే అనుభవం ఉంది. 2026 ఫిబ్రవరిలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రం–కేంద్రం మధ్య సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతల్లో ఒకటి. తెలంగాణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ కీలకంగా వ్యవహరిస్తోంది. 

ఇటీవల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అంశాలపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖతో జరిగిన సమావేశంలోనూ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇప్పటివరకు రెసిడెంట్ కమిషనర్‌గా డా. శశాంక్ గోయల్ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆయనతో పాటు అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొంటూ వచ్చారు. తాజా ఉత్తర్వులతో రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలను అదనంగా చేపట్టిన అద్వైత్ కుమార్ సింగ్, తన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ బాధ్యతలను కూడా కొనసాగించనున్నారు.


[ Delhi Telangana Bhavan, Advait Kumar Singh as Resident Commissioner, CM Revanth reddy, Dr. Shashank Goyal as Commissioner, Telangana goverment, Telangana police, Hyderabad police ]

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.