Medipalli: ఐదు నిమిషాల్లో రూ.2 కోట్ల ఆభరణాలు చోరీ.!

Publish Date:Oct 5, 2026

Advertisement

కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు. తెల్లవారు జామున చడి చప్పుడు కాకుండా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చేతికి అందినంతగా దోచుకుని.. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యారు. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారు , వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌ను దుండగులు టార్గెట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4:10 గంటల సమయంలో షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు.. అక్కడ ఉన్న గ్లాస్‌ను పగలగొట్ట కుండా ఎంతో చాకచక్యం గా ఓపెన్ చేశారు. 

అనంతరం వజ్రాభరణా లను ఒక్కొక్కటిగా బయటకు తీసి బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా పరారైనట్లు తెలుస్తోంది. ఈ చోరీలో ఏకంగా రూ.2 కోట్లకు పైగా విలువైనబంగారు ,డైమండ్ నగలు అపహరణకు గురైనట్లు సమాచారం. అయితే చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో బిల్డింగ్ యజమాని షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి పరిశీలించగా దొంగలు పడ్డట్లు గుర్తించాడు. వెంటనే బ్రాంచ్ అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. బ్రాంచ్ అధికారి వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన జ్యువెలరీ షాప్‌ వద్దకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దిగి దుండగులకు సంబం ధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగుల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నా రు. మరోవైపు చోరీ జరిగిన సమయంలో దుండగులు ఏ మార్గంలో వచ్చారు? చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? ముందస్తు సమాచారంతో చోరీకి పాల్పడ్డారా? లేక జ్యువెలరీ షాప్‌ను రెక్కీ చేసి మరీ టార్గెట్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో వజ్రాభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. నిందితు లను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ఐదు నిమిషాల్లో రూ.2 కోట్ల ఆభరణాల చోరీ.!

క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగినట్లుగా సమాచారం అందడంతో డిసిపి సురేష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ  సురేష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ షో రూమ్ లో మొత్తం ఏడుగురు దుండగులు కలిసి చోరీ చేసినట్లుగా గుర్తించామని డీసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. వీరిలో కేవలం ఒక్కరు మాత్రమే షోరూం లోపలికి వెళ్లగా.. మిగతా ఆరుగురు బయటే వేచి ఉన్నారు. పక్కా ప్రణాళికతో వచ్చిన ముఠా.. కేవలం ఐదు నిమిషాల్లోనే చోరీని పూర్తి చేసింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఐదు నిమిషాల తర్వాత మరోసారి డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుందని ముందే తెలిసిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని డీసీపీ  తెలిపారు. దీంతో షోరూం భద్రతా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈ ముఠాకు కీలకం గా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. చోరీలో పాల్గొన్న ఏడుగురు రాజస్థాన్‌కు చెందిన ముఠా అయి ఉండొచ్చని డీసీపీ  సురేష్ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ  వెల్లడించారు

 

 

 

[ Massive theft in Medipalli, Carat Lane Diamonds Jewellery Shop, Hyderabad, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, CP Sajjanar, Hyderabad police, DCP Suresh Reddy, Telugu One, Telugu News ] 
 

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.