న్యాయం కోసం గొంతెత్తితే.. లాఠీలకు పని చెబుతారా.. కేంద్రంపై నెటిజనుల ఆగ్రహం

Publish Date:Jul 20, 2026

Advertisement

 నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని సోమవారం (జులై 20) శాంతియుతంగా నిర్వహిస్తున్న  యువతపై పోలీసులు  ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా.. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా  లెక్కచేయకుండా విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి తమ హక్కుల కోసం నినదించారు. 

ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు.   అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని  ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు.   తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలనీ, నీట్ లీకేజీపై జవాబుదారీ తనం ఉండాలనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్న   విద్యార్థులను చర్చలకు పిలిచి మాట్లాడాల్సింది పోయి.. వారి గొంతు నొక్కాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

  నీట్ ప్రశ్రపత్రాల లీకేజీ కి వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన  దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.   విద్యారంగ సంస్కరణల కోసం జూన్ 28 నుంచి వరుసగా 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన  సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలి నుంచి పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడం, మరోవైపు హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ఎన్ఎస్‌యుఐ, ఎస్‌ఎఫ్ఐ, ఐవైఎఫ్, పిడిఎస్‌యు వంటి అనేక విద్యార్థి సంఘాలు ముట్టడించడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.  

Delhi NEET protest crackdown, Dharmendra Pradhan resignation, Modi government,  NEET criticism, Sonam Wangchuk, online anger

By
en-us Political News

  
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.