ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూత.. సుప్రీం సీరియస్.!

Publish Date:Jul 23, 2026

Advertisement

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు రోజు రోజుకూ ఉధృతమౌతున్నాయి.  బుధవారం (జులై 22)  నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకో వడంతో జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి,  నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించగా, పలుమార్లు ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.  

తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు, జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్‌తో పాటు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారు.

భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ)  నగరంలోని  16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.

మూసివేసిన మెట్రో స్టేషన్లు లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్ర ప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మొదలగు మొత్తం 16 మెట్రో సేవలను వినియో గించే ప్రయాణికులు ప్రయాణానికి ముందు తాజా సేవా వివరాలను పరిశీలించాలని, అవస రమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవా లని డీఎమ్ఆర్సీ  సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భద్రతా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే మెట్రో స్టేషన్లను తిరిగి తెరవనున్నట్లు అధికా రులు వెల్లడించారు.

ఇలా ఉండగా మెట్రో స్టేషన్ల మూసి వేత పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. మధ్యహ్నంలోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. మెట్రో స్టేషన్ల మూసి వేత కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయిన న్యాయవాదులపై ఎటువంటి చర్యలూ తీసుకోబోమని పేర్కొంది. 

Closure of 16 Metro stations in Delhi, supreme, serious, order, resolve, immediately

By
en-us Political News

  
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.