ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం
Publish Date:Oct 18, 2025
Advertisement
ఢిల్లీలోని ఎంపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్లమెంటు భవనం 200 మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఎంపీలు నివసిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సమాచరం అందుకున్నా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అందులోకి తెచ్చాయి.
అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 1:20 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/delhi-36-208159.html





