ఆ లింకులు తొలగించండి.. సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Publish Date:Feb 19, 2026

Advertisement

ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియా సంస్థకు చుక్కెదురైంది.  హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ దాఖలు చేసిన  పరువు నష్టం దావాలో, వివాదాస్పద కథనాలకు సంబంధించిన లింకులను తక్షణమే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా డెయిరీ నెయ్యి వివాదంతో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధం ఉందంటూ సాక్షి మీడియాలో  ప్రచురితమైన కథనాలు పూర్తి అవాస్తవాలని ఆరోపిస్తూ హరిటేజ్ ఫుడ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ కథనాలు తమ సంస్థ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయనీ, అవన్నీ సత్యదూరాలనీ పేర్కొంటూ హెరిటేజ్ ఫుడ్స్ వందకోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది.  భోలేబాబా డెయిరీతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవనీ,   తిరుమల తిరుపతి దేవస్థానానికి  తాము నెయ్యి సరఫరా చేయడం లేదని కూడా  స్పష్టం చేసింది. ఈ  పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, 24 గంటల్లోగా సదరు కథనాల లింకులను అన్ని వేదికల నుంచి తొలగించాలని సాక్షి మీడియాను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ తొలగించకపోతే.. ఆ లింకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలకు సూచించింది. 

By
en-us Political News

  
గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం ఒక పవిత్ర ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అపారమైన నమ్మకాన్ని, 56 శాతం భారీ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని సువేరా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, గెలుపే పరమావధిగా భావించి ఎలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు, గాలివాటంగా వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడమేనని ఆయన విశ్లేషించారు.
బ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ పనులు చేపట్టారు.
నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్‌లో 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం, మృతుల వివరాలు మరియు తాజా పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం.
గతంలో చట్ట సభల్లో ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ Oracle ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు ఆటోమేషన్ కారణంగా భారతీయ ఐటీ రంగం, ఫ్రెషర్స్ మరియు మిడ్లె వల్ మేనేజర్లపై పడనున్న ప్రభావం, మరియు మీ కెరీర్ కాపాడుకోవడానికి అవసరమైన టాప్ AI స్కిల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది.
2026 జూన్ 25 లేదా 26 తేదీలలో మొహర్రం బ్యాంక్ సెలవు ఎప్పుడు? హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు ఎందుకు మూతపడనున్నాయో ఆర్‌బీఐ (RBI) అధికారిక సెలవుల జాబితా ద్వారా ఇప్పుడే తెలుసుకోండి.
ఆర్‌బీఐ కొత్త ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల వల్ల టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. దీనితో టాటా కెమికల్స్ షేర్లు 4 శాతం పెరిగి రూ. 770 కి చేరాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ ముఖ్య గమనింపు. తిరుపతిలో ఇచ్చే ఉచిత టైమ్ స్లాట్ సర్వ దర్శనం (SSD) టోకెన్ల పంపిణీ సమయాలను మారుస్తూ TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కొత్త సమయాలు మరియు మూడు ప్రధాన కౌంటర్ల పూర్తి వివరాలు మీకోసం.
భారత క్రికెట్ క్రేజ్ ఇప్పుడు బిజినెస్ పవర్‌గా మారింది. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో తొలిసారిగా కేకేఆర్, సీఎస్‌కే, ఆర్‌సీబీ సహా ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల సరసన స్థానం సంపాదించాయి. ఈ జట్ల మొత్తం విలువ, వాటి ర్యాంకులు మరియు ఆదాయ వనరుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.