నాడు సానుకూలం.. నేడు ప్రతికూలం.. జగన్ లో ఓటమి భయం

Publish Date:Apr 4, 2024

Advertisement

సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. విజయం వరించే దీవెనలే లభిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ పరిస్థితికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. నాటి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగింది. ప్రధాని మోడీ సర్కార్ ఏపీ అభివృద్ధి విషయంలో ఇసుమంతైనా సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఊరూ వాడా ఏకం చేసేలా ప్రచారం సాగించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో చంద్రబాబు విభేదించిన నేపథ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో ఉన్న అప్పటి అధికార యంత్రాంగం అంతా చంద్రబాబు ఆపద్ధర్మ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసింది. వైసీపీ ఫిర్యాదులపై ఆఘమేఘాల మీద స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి సీఎస్ ను విధుల నుంచి తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నేరుగా నియమించింది. ఆయన అప్పట్లో వైసీపీకి ఎంత అనుకూలంగా వ్యవహరించారో అందరికీ తెలిసినదే. ఆయన సమన్ చేసి పిలిపించుకోవలసిన డీజీపీ వద్దకు స్వయంగా వెళ్లి మరీ దిశా నిర్దేశం చేశారంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 

అప్పట్లో మీడియా మొత్తం చంద్రబాబుకు అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయంటూ కథనాలు ప్రచురించింది. ప్రసారం చేసింది. ఏది ఏమైనా అప్పటి ఎన్నికలలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడిని తలపించాయి. దాంతో అప్పడు తెలుగుదేశం పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావలసి వచ్చింది. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి తెలుగుదేశం అనూహ్యం, అద్భుతం అనదగ్గరీతిలో పుంజుకుంది. 

జగన్ అస్తవ్యస్థ విధానాలు, ప్రజా వ్యతిరేక పాలన, కక్ష సాధింపు ధోరణి కారణంగా ప్రజలలో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతోంది. నాడు అంటే 2019 ఎన్నికల ముందు జగన్ కు కలిసి వచ్చిన ప్రతి అంశమూ ఇప్పుడు వ్యతిరేకంగా మారింది. నాను సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఇప్పుడు జగన్ కు ప్రతికూలంగా మారడమే కాకుండా ఈ రెండు సంఘటనలూ కూడా నాడు చంద్రబాబును ప్రజలలో బదనాం చేయడానికి జగన్ చేత, జగన్ కొరకు జగనే చేయించారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ రెండు సంఘటనల దర్యాపు, కోర్టులలో జరిగిన, జరుగుతున్న విచారణలో వెల్లడౌతున్న అంశాలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. అలాగే స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా వివేకా హత్య కేసులో జగన్ తీరునే తప్పుపడుతున్నారు. సునీత అయితే అసలు విలన్ జగనేనా అన్న అనుమానాలు వస్తున్నాయని మీడియా సమావేశంలోనే చెప్పేశారు. వివేహా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికే మళ్లీ కడప టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకుని ప్రచారం చేయడంతో జగన్ పట్ల ప్రజలలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వివేకా హంతకులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని జనం విశ్వసించడానికి దోహదకారిగా మారింది.

ఇక  ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించడంతో ఆయన దిక్కు తోచని స్థితిలో పడినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మేమందరం సిద్దం అని చాటుతూ జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర తుస్సు మనడమే కాకుండా, ఆ యాత్ర ప్రారంభించిన నాటి నుంచీ జగన్ కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. జగన్ బస్సుయాత్ర కడప దాటిందో లేదో కడన లోక్ సభ బరి నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రకటించారు.  అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేరుగా జగన్ ప్రభుత్వం మీద, ఆయన సొంత కుటుంబ సభ్యులను దూరం చేసిన తీరుపైనా నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. ఇంత కాలం జగన్ కు అండగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును ఆయనకు దూరం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించిన షర్మిల జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇంతకాలం వైసీపి వైపు ఉన్న కాంగ్రెస్‌ ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్‌ వైపు  చూస్తున్నారు.  ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీ కచ్చితంగా జగన్ కంచుకోటలను బీటలు వారుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మరోపక్క సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు గురించి సాక్షి మీడియాలోనే  జగన్ తోముఖాముఖీకి సిద్ధమని విసిరిన సవాల్ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనడంలో సందేహం లేదు. ఆ సవాల్ ను స్వీకరించనూలేక, అలాగని సమాధానం చెప్పకుంటే సునీత ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ వివేకా హంతకులతో తాను అంటకాగుతున్నట్లు జనం భావిస్తారన్న భయంతో జగన్ దిక్కు తోచని స్థితిలో పడ్డారని అంటున్నారు. అదే సమయంలో పుండుమీద కారం చల్లిన చందంగా  జగన్‌  కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఒక ఐజీ సహా ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ వేటు వేసింది. వారందరినీ ఎన్నికల విధులకు దూరం చేసింది.  గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తరములేశ్వర్ రెడ్డిలను సరిగ్గా ఎన్నికలకు ముందు విధుల నుంచి తప్పించడం జగన్‌ ప్రభుత్వానికి నిస్సందేహంగా మింగుడుపడని విషయమే.  

చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి లేదా కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి కోరుకున్నది కూడా ఇదే.  జగన్‌ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతోనే దానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని పరిశీలకులు ఎప్పుడో విశ్లేషించారు. ఇప్పుడు ఆ విశ్లేషణలన్నీ సరైనవేనని తెలుతోంది.  ఈ ఐదుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ లపై వేటుతోనే ఈసీ ఆగుతుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, రాష్ట్రంలో ఇంకా పలువురు అధికారులు  ఇప్పటికీ జగన్ సేవలో తరిస్తున్నారనీ, వారిపై కూడా రానున్న రోజులలో వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు.  ఇక అన్నిటికీ మించి వాలంటీర్లను పింఛన్ పంపిణీ నుంచి దూరంగా ఉంచాలన్న ఈసీ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారనీ, కుట్రతో వృద్ధులు, వికలాంగులకు పించన్లు అందకుండా చేస్తున్నారనీ ప్రచారం చేసిన వైసీపీకి  సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇళ్ళవద్దే పింఛన్లు చెల్లించాలని ఈసీ ఆదేశించడం  పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.  ఈసీ   ఈ నెల 6వ తేదీలోగా అందరికీ పింఛన్లు అందించాలని ఉత్తర్వులు జారీ చేయక  తప్పని పరిస్థితిలో జగన్ సర్కార్ పడింది.  

సచివాలయ సిబ్బంది మూడు రోజులలో అందరికీ పింఛన్లు చెల్లించగలిగితే, మరి ఇంతకాలం లక్షల మంది వాలంటీర్లను ఎందుకు ప్రభుత్వం ఎందుకు పోషించింది అన్న ప్రశ్న జనంలో ఉత్పన్నం అవుతుందన్న భయం కూడా జగన్ ను వెంటాడుతోంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలుగా మారుతాయని జగన్ వణికి పోతున్నారు. గత ఎన్నికలలో  కలిసి వచ్చిన అంశాలే ఇప్పుడు ప్రతికూలంగా మారి ముంచేస్తాయని ఆందోళనలో ఉన్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ ఇప్పుడు సానుకూలంగా మారి విజయమే తరువాయి అన్న భరోసాను కల్పిస్తున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.