దావూద్ కి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టేనా?

Publish Date:Sep 2, 2016

Advertisement


 
మోదీ ప్రధాని అయ్యాక మొత్తం ప్రపంచంలో తల పట్టుకుని కూర్చున్న ఏకైక దేశం ఏదైనా వుందంటే అది పాకిస్తానే అనాలి! అందుక్కారణాలు బోలెడు... మొన్నటికి మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బలూచిస్తాన్ గురించి మోదీ మాట్లాడినప్పటి నుంచీ అక్కడ నానా రచ్చ జరుగుతోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రవాస బలూచిస్తాన్ ప్రజలు మోదీ ఫోటోలతో వీధులకు ఎక్కుతున్నారు. ఇండియా జెండాలతో నిరసనలు తెలుపుతూ పాక్ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరో కోణంలో కూడా మోదీ సర్కార్ పాక్ ని టెన్షన్ పెడుతోంది! అదే కరాచీలో దాక్కున్న దావూద్ కోణం!

 

ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాక్ లో వున్నాడని అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఎన్ని కహానీలు చెప్పినా డి కంపెనీ బాస్ ఆ దేశంలోనే తిష్ట వేశాడని మన రా అధికారుల వద్ద పక్కా సమాచారం వుంది. అంతే కాదు, కరాచీలోని ఏ వీధిలో ఏ ఇంట్లో ఏ పేరుతో వున్నాడో కూడా ప్రదాని మోదీ సలహాదారు అజిత్ ధోవల్ కు క్లియర్ గా తెలుసు...

 

మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ దావూడ్ పై మన నిఘా వర్గాల కన్ను తీవ్రంగా పడింది. అసలు ఈ పాటికే దావూద్ ఎన్ కౌంటర్ ఎప్పుడో జరిగిపోవాల్సింది. కాని, పాకిస్తాన్ లాంటి శత్రుదేశంలో తల దాచుకోటంతో కొంత ఆలస్యం అవుతోంది. అంతే కాదు, దావూద్ ని ప్రాణాలతో పట్టుకుంటే ఇండియాకి చాలా లాభం. అందు కోసం కూడా తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి ఇండియా నిఘా వర్గాలు.

 

తాజాగా ఇండియన్ గవర్నమెంట్ దావూద్ ప్లాన్స్ ని ఇండియా టుడే బయటపెట్టింది. ఆ పత్రిక ఇచ్చిన సమాచారం కరెక్టే అయితే మాత్రం మాఫియా డాన్ కదలికలపై నిఘా వుంచేందుకు దాదాపు 50మంది అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. ఇన్ కమ్ ట్యాక్స్, ఈడీ, రా విభాగాల నుంచి ఈ అఫీషియల్స్ ను ఎంపిక చేశారట. వీళ్లంతా ఎప్పటికప్పుడు దావూద్ కదలికల్ని, అతడి అనుచరుల కదలికల్ని, అతని కుటుంబ సభ్యుల వ్యవహారాల్ని గమనిస్తుంటారట!

 

దావూద్ కరాచీలో వున్నట్టు, అతడి ఆరోగ్యం తీవ్రంగా పాడైనట్టు, షేక్ ఇస్మాయిల్ మర్చెంట్ అనే దొంగ పేరుతో అతడు కాలం గడుపుతున్నట్టు మన ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే బయటపెట్టాయి. అనేక వందల మంది చావులకి కారణమైన ముంబై దారుణానికి మూలం దావూద్. అలాంటి మాఫియా రాక్షసుడు త్వరలోనే పట్టుబడాలని ఆశిద్దాం. లేదంటే అమెరికా లాడెన్ హతమార్చినట్టు మన వాళ్లు దావూద్ ని పాక్ భూభాగంలోనే ఖతమ్ చేయాలని కోరుకుందాం... 

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.