ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నారని కన్నవారిని హత్య చేసిన కుమార్తె!
Publish Date:Jan 28, 2026
Advertisement
తన ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో కన్న తల్లిదండులనే హతమార్చిన కుమార్తె ఉదంతమిది. తన ప్రేమవివాహానికి అడ్డుగా ఉన్నారని ఆ కుమార్తె ఈ దారుణానికి ఒడిగట్టింది. వికారా బాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దశరథ్, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు అశోక్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అక్కడే ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇద్దరి కులం ఒకటి కాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న ఆమె వారిని పథకం ప్రకారం హత్య చేసింది. తల్లిదండ్రులకు కెటామైన్ కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది. తాను పని చేస్తున్న హాస్పిటల్ నుంచి నాలుగు మత్తు ఇంజక్షన్ బాటిల్స్ ను రహస్యంగా సేకరించింది. ఈ నెల 24న ఓ మెడికల్ షాప్లో మూడు సిరంజీలు కొనుగోలు చేసి స్వగ్రామమైన యాచారం గ్రామంలోని తన ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి భోజనం అనంతరం మరోసారి ప్రేమ వివాహం విషయమై తల్లిదండ్రులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. తల్లిదండ్రులు స్పష్టంగా నిరాకరించడంతో ఇక తన పథకం అమలు చేసింది. రాత్రి 10 గంటల సమయంలో తల్లికి ఒళ్లునొప్పుల మందు అంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ఇచ్చింది. స్పృహ కోల్పోయి కుప్పకూలిన తల్లిని నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టింది. కొద్ది సేపటి తరువాత తండ్రికి కూడా అదే విధంగా నొప్పుల మందు అంటే మత్తు ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇచ్చింది. అయితే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నేరస్థలంలో ఉపయోగించిన రెండు సిరంజీలు, వాటిపై రక్తపు చుక్కలు ఉండటంతో అనుమానించి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా చిన్న కూతురిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన విచారించగా ఆమె నేరం అంగీకరించింది. ఘటనా స్థలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు మత్తు ఇంజెక్షన్ బాటిళ్లు, రెండు సిరంజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు.
అనంతరం తల్లిదండ్రుల మృతిని సహజమరణాలుగా చూపేందుకు ప్రయత్నించింది. తన అన్నకు ఫోన్ చేసి తనతో మాట్లాడుతుండగానే తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలి పోయాడని, పల్స్ చెక్ చేయగా మృతి చెందినట్లు తెలిసిందని నమ్మబలికింది. తన తండ్రి మరణంతో షాక్ కు గురైన తల్లి కూడా గుండె ఆగి మరణించిందని బొంకింది.
http://www.teluguone.com/news/content/daughter-kills-parents-36-213127.html





