కరోనా పుట్టుకపై సంచలన నిజాలు! 

Publish Date:May 31, 2021

Advertisement

ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా మహమ్మారి వైరస్ పుట్టుకపై  నివ్వరపోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలను బ్రిటన్‌ పత్రిక‘డైలీ మెయిల్‌’ బహిర్గతం చేసింది. కరోనా వైరస్‌ దానికదే ప్రకృతిలో సహజంగా పుట్టలేదని, ఆ వైరస్‌ను చైనానే ల్యాబ్‌లో సృష్టించిందని సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకుబ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఆంగస్‌ డాల్‌గ్లిశ్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సోరెన్సెన్‌ సంయుక్తంగా జరిపిన పరిశోధన అంశాలను వెల్లడించింది. 

చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్‌లో నిర్వహిస్తున్న ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులో భాగంగా కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు కృత్రిమంగా ఈ వైరస్‌ను సృష్టించారు.. దీనికోసం తమ దేశంలోనే గుహల్లో ఉండే గబ్బిలాల్లోని కరోనా వైరస్‌ ప్రాథమిక స్పైక్‌ ప్రొటీన్‌ను ఆధారంగా తీసుకున్నారని తమ ప్రచురణలో తెలిపింది. ఈ అధ్యయనం సైన్స్‌ పత్రిక ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ డిస్కవరీ’లో త్వరలో ప్రచురితం కానుంది. 

అంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిశ్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేసిన వారిలో ఒకరు. వైరాలజిస్ట్‌గా ఉన్న సోరెన్సెన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టుకపై డాల్‌గ్లిశ్‌ ప్రత్యేక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమం చైనా దుర్భుద్ధి మరోసారి బహిర్గతమైంది. సహజంగా ఏర్పడిన వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఉంటాయి. అత్యంత అరుదుగా మూడు ఉండొచ్చు. అయితే, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో నాలుగు అమైనో యాసిడ్‌లు ఉన్నాయి. సాధారణ వైరస్‌ను ల్యాబ్‌లో కృత్రిమంగా తీవ్రతరం చేస్తేనే నాలుగు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఏర్పడుతాయి. ఇవి మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మామూలు వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది. కృత్రిమ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా కరోనా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించారని భావిస్తున్నారు.

కరోనా వైరస్‌ మూలలపై చర్చ కొనసాగుతున్న సమయంలో  ‘డైలీ మెయిల్‌’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. జంతువులు, వైరస్‌లపై గత నలభై సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని, కరోనా వైరస్ ఖచ్చితంగా సహజమైనది కాదని, ఇది ముమ్మాటికి తయారు చేయబడిందని హోంజో చెబుతున్నారు. అంతేకాదు డాక్టర్ తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవాన్ని కూడా వివరించారు. ఆ ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో పరిచయం ఉందని, కరోనావైరస్ కనిపించిన తరువాత వారందరినీ తాను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా వారి ఫోన్‌లన్నీ స్పందించడం మానేసాయని చెప్పుకొచ్చారు. అంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన టెక్నీషియన్లందరూ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని అర్థమవుతోందంటూ ఆయన సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు. కరోనా వైరస్ సహజంగా పుట్టుకొచ్చింది కాదని, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు.

‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ను మానవ పరిణామక్రమాన్ని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టులుగా చెబుతారు. కొత్తగా వెలుగుచూసే వైరస్‌లు భవిష్యత్‌లో ఎలా పరిణామక్రమం చెందొచ్చు? ప్రమాదాలు, నివారణ మార్గాలపై ఈ ప్రాజెక్టుల్లో భాగంగా పరిశోధిస్తారు. దీని కోసం సహజంగా పుట్టిన వైరస్‌ శక్తిని కృత్రిమంగా పెంచుతారు. అయితే, ఈ ప్రాజెక్టులతో ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వీటిపై నిషేధం విధించారు. చైనా మాత్రం వీటిని కొనసాగించింది.

‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులను అత్యంత కట్టుదిట్టమైన ల్యాబ్‌లలో నిర్వహించాలి. వ్యాక్సిన్ల తయారీకి వాడే బయోసేఫ్టీ లెవల్‌ 2, 3 ల్యాబ్స్‌ వీటికి సరిపోవు. అయినప్పటికీ వూహాన్‌ ల్యాబ్‌లోని బయోసేఫ్టీ లెవల్‌ 3 విభాగంలో చైనా పరిశోధకులు కరోనాను కృత్రిమంగా సృష్టించడంతో వైరస్‌ లీక్‌ అయింది. అయితే, దీన్ని చైనా అధికారులు కావాలనే లీక్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రయోగాలను వ్యతిరేకించిన ల్యాబ్‌లోని కొందరు శాస్త్రవేత్తలను చైనా అధికారులు బెదిరించారు. మాట వినని మరికొందరు కనిపించకుండాపోయారు.

లీకైన కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం అంచనాలకు మించడంతో చైనా ఆత్మరక్షణలో పడింది. దీంతోపాటు వైరస్‌ పుట్టుకపై ప్రపంచ దేశాలు ప్రశ్నలు లేవనెత్తడం, దర్యాప్తునకు ఒత్తిడి చేయడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ‘రివర్స్‌-ఇంజినీరింగ్‌ (రెట్రో ఇంజినీరింగ్‌)’ సాంకేతికతతో కరోనా వైరస్‌ సహజంగానే ఏర్పడినట్టు నకిలీ ఆధారాలను సృష్టిద్దామని చైనా అధికారులు ప్రయత్నించారు. అందుకే తమదేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు బాధితుడిలో కనిపించిన వైరస్‌ నమూనాల సమాచారాన్ని కొంతకాలం విడుదల చేయలేదు. కొన్ని నెలల తర్వాత ఆ డేటాను విడుదల చేశారు. అయితే అది కూడా అంత నమ్మశక్యంగా లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.