Publish Date:Jan 20, 2025
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ పార్టీ నేతలూ, కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి తెలుగుదేశం అధిష్ఠానం చెక్ పెట్టింది. ఇకపై ఎవరూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ వ్యాఖ్యలు, డిమాండ్లూ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Jan 20, 2025
పేదలు సంజీవినిగా భావించే ఆరోగ్య శ్రీ సేవలు తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను చెల్లించకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో వేయి కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద వైద్య సేవలు అందించడం తమ వల్ల కాదని తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రిలు చేతులెత్తేశాయి.
Publish Date:Jan 20, 2025
పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఈ విభేదాలకు కారణం తెలుగుదేశం నాయకుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎస్ వర్మ వ్యాఖ్యలే కారణమా అంటే జనసైనికులు ఔనని అంటున్నారు.
Publish Date:Jan 20, 2025
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం అయ్యింది. సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మంత్రులూ, అధికారుల బృందంతో అక్కడకు చేరుకున్నారు.
Publish Date:Jan 20, 2025
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పెట్టుబడుల వేట ఆరంభమైంది. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం అక్కడకు చేరుకుంది.
Publish Date:Jan 20, 2025
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో నిందితులను వరుసగా విచారణలకు పిలుస్తూ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏ1 బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఏసీబీ, ఈడీలు విచారించిన సంగతి తెలిసిందే.
Publish Date:Jan 20, 2025
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం (జనవరి 19) శ్రీవారిని మొత్తం 70 వేల 826 మంది వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. వారిలో 22 వేల 625 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
Publish Date:Jan 19, 2025
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం (జనవరి 19) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ల పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.
Publish Date:Jan 19, 2025
అయోధ్య బాలరామాలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆయన అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Publish Date:Jan 19, 2025
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం లోని చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
Publish Date:Jan 19, 2025
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్రమవుతున్న ఈ డిమాండ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం టీడీపీ కార్యకర్తల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
Publish Date:Jan 18, 2025
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల కిందట సూగూరు సంస్థానా దీశులు నిర్మించిన వైష్ణవాలయాన్ని భద్రపరచి పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
Publish Date:Jan 18, 2025
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన, ... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ టీటీడీలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష నిర్వహిస్తారనీ, ఆది సోమవారాల్లో (జనవరి 19, 20) ఆయన తిరుమలలో పర్యటించి సమీక్షించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారనీ పేర్కొంటూ అధికారిక లేఖ రాశారు.