Publish Date:Jan 18, 2025
కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అత్యంత పవిత్రమైన తిరుమలలో ఇటీవల తరచుగా కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.
Publish Date:Jan 18, 2025
మంత్రి కొండాసురేఖ మెదక్ జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదం చెలరేగింది. చిల్లర పనులు వద్దంటూ ఎమ్మెల్యే కొత్త కోట ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేయడంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది.
Publish Date:Jan 18, 2025
ముడాస్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కుంభకోణం మూలాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
Publish Date:Jan 18, 2025
నిన్నమొన్నటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లలు తప్పనిసరి చేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అసలుఎన్నికలకు,పిల్లలకు సంబంధం ఏమిటనే ప్రశ్న రావడం సహజం. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో జనాభా రేటు తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి.
Publish Date:Jan 18, 2025
తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి భక్తుల మరణించిన ఘటనపై దాఖలైన పిల్ లో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, సీఎంలను చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తొక్కిసలాట సంఘటనకు వారు ఎలా బాధ్యులౌతారని పిటిషనర్ ను ప్రశ్నించింది.
Publish Date:Jan 18, 2025
మాజీ ఎంపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయాల్సిందిగా విచారణ అధికారి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Publish Date:Jan 17, 2025
నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. శనివారం (జనవరి 18) ఆయన వర్ధంతి.
Publish Date:Jan 17, 2025
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వంటి నేత ఆయన ఒక్కరే. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల స్వల్ప కాలానికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కడు.. శకపురుషుడు.. నందమూరి తారకరామారావు.
Publish Date:Jan 17, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ప్రభుత్వం పని తీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గడిచిన ఐదేళ్ల కాలంలో సంక్రాంతి పండుగను సైతం సరిగా జరుపుకోలేకపోయిన ఏపీ ప్రజలు ఈ ఏడు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
Publish Date:Jan 17, 2025
చెప్పేటందుకే నీతులు అన్న విషయాన్ని బీజేపీ మరోమారు రుజువు చేసింది. పలు సందర్భాలలో ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత హామీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల వేళ విజయం కోసం ఉచితాలపైనే ఆధారపడ్డారు.
Publish Date:Jan 17, 2025
ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు.
Publish Date:Jan 17, 2025
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని కేంద్రం విస్పష్టంగా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. విశాఖ ఉక్కును నష్టాల నుంచి బయటపడేయడానికి 11 వేల 440 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది.
Publish Date:Jan 17, 2025
తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడే విషయంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వయంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టే విషయంలో పోలీసులు గట్టిగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు.. ఈ కేసులో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.