12 మంది సైబర్ నిందితుల అరెస్టు

Publish Date:Nov 14, 2025

Advertisement

డిజిటల్‌ అరెస్టు పేరిట  దోచుకుంటున్న 12 మంది సైబర్‌ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు శుక్రవారం (నవంబర్ 14) అరెస్టు చేశారు.   కడప  ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆ వివరాలు వెల్లడించారు.  నిందితులు వేంపల్లెకు చెందిన రిటైర్డ్‌ ఎంఈవో వీరారెడ్డికి ఏడు నెలల కిందట వీడియోకాల్‌ చేసి ఆయన పేరుతో ఉన్న సిమ్‌ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఢిల్లీలో కేసు నమోదైందని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలంటూ  ఫేక్‌ సుప్రీంకోర్టు కాపీలు వాట్సప్‌ ద్వారా పంపించి డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించారు.

ఈ అరెస్టును తాత్కాలికంగా వాయిదా వేసేందుకు డబ్బు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంటులోని డబ్బు పంపించారు. అలా దాదాపు ఏడు నెలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరారెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు వేంపల్లెకు వచ్చినట్టు సమాచారం రావడంతో 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.

By
en-us Political News

  
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
తంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గురువారం నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి బుధవారం స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.