జగన్‌పై తీవ్ర జనాగ్రహం.. ఎమ్మెల్యేల పనితీరు అధ్వాన్నం.. ‘సీ-ఓటర్’ సర్వేలో సంచలనం..
Publish Date:Oct 20, 2021
Advertisement
ఒక్క ఛాన్స్ అని అందలం ఎక్కిస్తే.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు జగన్. అక్రమాలు, ఆగడాలను ఏపీ కేరాఫ్‌గా మారుతోందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాకు ఏపీనే అడ్డా అనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దోపిడీ, ధరల పెంపు, పన్నుల బాదుడు, సంక్షేమ పథకాల కోత, అర్థంపర్థం లేని మద్యం పాలసీ, జీతాలకు కటకట, అప్పులకు తిప్పలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అందుకే, జగన్ పాలనపై ప్రజలు విసిగి వేసారి పోయారు. ఇదే చివరి ఛాన్స్ అంటూ తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ సర్వే చేపట్టినా అందులో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. గతంలో ఇండియా టుడే సర్వే జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తేల్చింది. తాజాగా జాతీయ స్థాయిలో బాగా పేరున్న ‘సీ-ఓటర్’ సర్వేలోనూ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సరికొత్త సర్వే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అధినేత జగన్‌రెడ్డి అరాచకాలకు కేరాఫ్‌గా నిలిస్తుంటే.. అదే బాటలో వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం అక్రమాల బాట పడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలన్నీ వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అంటున్నారు. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు, ల్యాండ్ దందాలు, పేకాట శిబిరాలతో విచ్చలవిడి చేస్తున్నారనే ఆరోపణ ఉంది. అందుకే, తాజాగా నిర్వహించిన ‘సీ-ఓటర్’ సర్వేలో సీఎం జగన్‌కంటే, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపైనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా జాతీయ రికార్డు సొంతం చేసుకోవడం వారిపై ఉన్న ప్రజాగ్రహానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు రెండున్నరేళ్లలో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారు. ‘సీ-ఓటర్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ‘ఐఏఎన్‌ఎస్ - సీ ఓటర్ పరిపాలన సూచీ’ పేరిట చేపట్టిన సర్వే ఫలితాలను ఐఏఎన్‌ఎస్ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం... దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఏపీ ఎమ్మెల్యేలపైనే కనిపించింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై 28.5 శాతం మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజలు అత్యధిక ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా రెండోస్థానంలో (24.3 శాతం) ఉంది. ‘సీ-ఓటర్’ ముఖ్యమంత్రులపైనా సర్వే చేసింది. అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిస్థానంలో నిలిచారు. ఆయనపై 30.30శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై 28.1 శాతం వ్యతిరేకతతో రెండో స్థానంలో ఉన్నారు. జగన్ టాప్ 10లో నిలిచారు. సీఎం జగన్ కన్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు మరింత వేస్ట్ అన్నట్టు ‘సీ-ఓటర్’ సర్వే తేల్చడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది. ఓవైపు ప్రశాంత్ కిశోర్ టీమ్ రంగంలోకి దిగడం.. మరోవైపు ప్రజల్లో తమపై ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో మరోసారి టికెట్ వస్తుందో రాదో అనే టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేలను వేధిస్తోంది.
http://www.teluguone.com/news/content/cvoter-shocking-survey-on-ycp-mlas-25-124856.html





