కడప జిల్లాలో సీఎం బంధువు భూకబ్జాలు? వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియోతో కలకలం..

Publish Date:Sep 11, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి.  ఎన్ని విమర్శలు వస్తున్నా డోంట్ కేర్ అంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు.  అధికారం అండతో అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ పెద్దలు వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొందరు నేతలు సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలి పెట్టడం లేదని తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలంలో ఓ మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వైసీపీ కార్యకర్త అయిన ముస్లిం వ్యక్తి.. తన భూమిని వైసీపీ నేత కబ్జా చేశాడని వాపోతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

సీఎం జగన్  బంధువు తన భూమిని కబ్జా చేశాడని, ఇదేంటిని అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు అక్భర్ బాషా. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా భార్యకు వారి పుట్టింటి వారు.. ఎకరం యాభై సెంట్ల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని వైసీపీ నేత ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాషా వాపోతున్నారు. తిరుపాల్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీఐ కొండారెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో ద్వారా తమ కష్టాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేయకపోతే అంతా ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. 

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అక్బర్ బాషా కుటంబంపై వేధింపులు బయటపడడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని అన్నారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు... అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని చంద్రబాబు తెలిపారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని... ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు సూచించారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్‌రెడ్డి బంధువులు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి క‌న్నుప‌డితే క‌బ్జా, ఆశ‌ప‌డితే ఆక్ర‌మ‌ణ.. అన్నట్టుగా తయారైందని విమర్శించారు. కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్య‌వ‌స్థని జ‌గ‌న్‌రెడ్డి.. ఫ్యాక్ష‌న్ సైన్యంగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రాక్ష‌స రాజ్యం సాగుతోందన్నారు. కబ్జాలపై స్వయంగా వైసీపీ కార్యకర్తలే బహిరంగా చెప్పే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన కార్యకర్త పొలాన్నే క‌బ్జా చేశార‌న్నారు. ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త‌ అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు..ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్య‌క‌ర్త బాషాయే వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు తాళ‌లేక కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని రోధిస్తున్నారన్నారు లోకేష్.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.