కేసీఆర్ పాలనపై శంఖారావమేనా? అమిత్ షా సభతో సంకేతమా?

Publish Date:Sep 11, 2021

Advertisement

సెప్టెంబర్ 17... ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత గురించి తెలంగాణ ప్రజలకు  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తెలంగాణకు స్వాతంత్రం ప్రసాదించిన తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది. అది మనదరికీ తెలుసు. అదే రోజున దేశమంతా మువన్నెల జెండా రెపరెప లాడింది. అయితే నిజాం సంస్థానం, హైదరాబాద్ స్టేట్ (ప్రస్తుత తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు)కు మాత్రం ఆరోజున నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించలేదు. ఆ తర్వాత సుమారు 13నెలలకు, 1948 సెప్టెంబర్ 17 వ తేదీన ఉక్కు మనిషి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. నిజాం సంస్థానం భారత దేశంలో విలీనమైంది. అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినంగా చరిత్రలో మిగిలిపోయింది.నిజానికి అదే తెలంగాణ స్వాతంత్ర దినం.  

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం,  సెప్టెంబర్ 17 తేదీని తెలంగాణ విమోచన/ విలీన దినంగా అధికారికంగా గుర్తించేందుకు అంగీకరించ లేదు. నిజానికి, రాష్ట్ర విభజనకు ముందు, తెరాస సెప్టెంబర్ 17 తేదీని, మహా రాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలలో నిర్వహిస్తున్న విధంగా  తెలంగాణలోనూ అధికారికంగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో సమానంగా  నిర్వహిస్తామని మాటిచ్చింది. అయితే, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తయినా, తెరాస ప్రభుత్వం ఆ మాటే మరిచి పోయింది. అయితే బీజేపీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటోంది. అలాగే, తెరాస సహా ఇతర పార్టీలు కూడా అదే రోజును పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరేసి, తెలంగాణ విలీన దినంగా జరుపుకుంటున్నాయి. 

 తెలంగాణ పై రాజకీయంగా పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ, ఈసంవత్సరం ముందున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను, అలాగే, 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 17 తేదీన తెలంగాణ విమోచన దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన  నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తున్నారు. వెయ్యి ఉరుల మర్రిని వేదికగా ఎంపిక చేసుకోవడంలో బీజీపీ తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది  ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది,

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, నిజాం నిరంకుశ పాలనతో పోలుస్తున్న బీజేపీ, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే, ఈ సెప్టెంబర్ 17 న అమిత్ షా నిర్మల్‌ వెయ్యి ఉరులమర్రి నుంచి శంఖారావం పూరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే అమిత్ షా నిర్మల్‌కు వస్తున్నారని తెలిపారు. చారిత్రాత్మక ప్రాశస్త్యం గల నిర్మల్ గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకబోతోందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో కేసీఆర్ గుండెల్లో దడ మొదలయ్యిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు అమిత్ షా శంఖారావం పూరించబోతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. 

By
en-us Political News

  
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.