వివాహం అయిన ప్రతి జంట ఈ దశలను దాటుకుంటూ వెళ్లాలి..!
Publish Date:Sep 30, 2025
Advertisement
ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది చాలా కీలకమైన దశ. ఇద్దరు వ్యక్తులు పెళ్లికి ఒప్పుకుని, మూడు ముళ్లతో ఒకటైనంత సులువుగా వారి వైవాహిక జీవితం ఉండదు. రెండు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వారు ఒకేచోట ఉండటం అంటే చాలా అభిప్రాయ బేధాలు కూడా వస్తుంటాయి. అయితే అభిప్రాయ బేధాలను దాటుకుంటూ.. ఇద్దరూ కలిసి ఉండటంలోనే వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునే నేర్పు ఉంటుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో కొన్ని దశలను తప్పక దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ దశలు ఏంటో.. వాటిని దాటేటప్పుడు జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకుంటే.. పెళ్లైన కొత్తలో.. రియాలిటీ చెక్.. సర్దుబాటు.. పేరెంట్స్.. మిడ్ లైఫ్ ఛాలెంజెస్.. సహవాసం.. - రూపశ్రీ
పెళ్లైన కొత్త.. స్త్రీ, పురుషుల జెండర్ అట్రాక్షన్ చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ దశలో ఇద్దరూ చాలా క్లోజ్ గా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉంటారు. ఆ దశలో ఒకరు చేసే తప్పును మరొకరు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అది ఎక్కువ సేపు ఉండదు. దీనికి కారణం శారీరక రిలేషన్. అయితే పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక రిలేషన్ సరిగా లేకపోతే.. వారిమధ్య చిన్న విషయాలు, చిన్న తప్పులు కూడా చాలా పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. కాబట్టి పెళ్లైన కొత్తలో భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే అది శారీరక బంధంతోనే సాధ్యం.
పెళ్లంటే కేవలం భార్యాభర్తల మధ్య సరదాలు, సంతోషాలు, అలకలు, షికార్లు.. ఇవి మాత్రమే కాదు.. పెళ్లయ్యాక ఇద్దరికి బాధ్యతలు పెరుగుతాయి. వాటికి తగ్గట్టు ఇద్దరికి వేర్వేరు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల కారణంగా ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. విమర్శించుకుంటూ ఉంటారు. ఇది భార్యాభర్తలకు పెద్ద సవాల్ గా మారుతుంది. ఎప్పుడు కూడా వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరూ కలిసి జీవితాన్ని ఎట్లా లీడ్ చేసుకుంటారు అనే దాని మీద ఇద్దరి ఆలోచన ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా డీల్ చేసుకోవడంలోనే బంధం బలం ఎంతో బయటపడుతుంది.
అడ్జస్ట్మెంట్.. ఇది చాలా ముఖ్యమైన ఆయుధం. భార్యాభర్తల బంధం అయినా, స్నేహం అయినా, వ్యాపారం అయినా, ప్రేమ అయినా సర్దుబాటు అనేది లేకపోతే అది ఎప్పటికీ విజయవంతం కాదు. ముఖ్యంగా బార్యాభర్తల బంధంలో సర్దుబాటుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాజీ పడటం, ఓర్పుగా ఉండటం, ఏ సమస్య వచ్చినా బ్యాలెన్స్ గా ఉండటం వంటివి బంధాన్ని నిలబెడతాయి.
పెళ్లైన ప్రతి జంటకు తల్లిదండ్రులు కావడం ఒక అపురూపమైన దశ. ఇద్దరు కాస్తా ముగ్గురు కావడం, ఆ తరువాత సంఖ్య పెరగడం.. ఇది చాలా అద్బుతంగా ఉంటుంది. రెండు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తామే ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవడం వాళ్ళ ఉనికిని తెలిపే విషయం. పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు ఎట్లాగైతే పెళ్లైన తర్వాత మార్పులకు లోనవుతాయో.. పెళ్లైన తర్వాత ఉండే చాలా విషయాలు.. పేరెంట్స్ అయిన తరువాత మార్పులకు లోనవుతాయి. కొత్త ప్రాధాన్యతలు వస్తాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల దశ చాలా బాధ్యతాయుతమైనది.
మిడ్ లైఫ్ అంటే 40 ఏళ్ళు దాటిన తరువాత నుండి 60ఏళ్ళు టచ్ చేసే వరకు. ఈ ఇరవయ్యేళ్ల కాలంలో తల్లిదండ్రులకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. పిల్లలు పెద్దవాళ్లు అవుతూ ఉంటారు. లైఫ్ లో సెటిల్ కావడానికి ఇల్లు కొనడం, పిల్లల చదువుల ఖర్చులు, పిల్లలు పెద్దగవడం, తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లల పెళ్లిళ్ళు.. ఆరోగ్యం.. ఇట్లా చాలా విషయాలు ఛాలెంజ్ లు ఇస్తాయి.
సహవాసం అంటే కలిసి ఉండటం అని చాలా మందికి తెలుసు. కానీ.. భార్యాభర్తల లైఫ్ లో కలిసి ఉండటం ఒకరికి ఒకరు అనే అభిప్రాయం చాలా దృఢంగా మారేది వృద్దాప్యంలోనే. పెళ్లి అయ్యాక, పిల్లలు వచ్చాక వాళ్ల ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. కానీ వృద్దాప్యం వచ్చాక, పిల్లల పెళ్లిళ్లు అయిపోయాక.. అప్పుడే భార్యాభర్తలకు ఒకరికొకరు అనే స్థితి కాస్త స్థిరంగా ఉంటుంది. ఈ జీవిత చివరి దశను ఎంత సంతోషంగా గడపగలిగితే.. ఆ భార్యాభర్తలు తమ అవసాన దశలో అంత తృప్తిగా జీవితాన్ని ముగించగలుగుతారు.
http://www.teluguone.com/news/content/crucial-stages-every-couple-must-go-through-35-207144.html





