జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానుల హడావుడి.. ఉద్రిక్తత
Publish Date:Dec 6, 2025
Advertisement
హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానులు హంగామా సృష్టించారు. సయ్యద్ ముస్తాక్ అలీ రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు జితేష్ శర్మ, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ వచ్చారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు తరలి వచ్చారు. గ్రౌండ్ లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా గుమిగూడటంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎవరినీ మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు వారిని అదుపు చేశారు.
http://www.teluguone.com/news/content/cricket-fans-reach-to-gymkhana-ground-in-big-number-36-210603.html





