పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి.. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా?
Publish Date:Jun 6, 2025
Advertisement
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి .. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా? క్వార్జ్ట్ అక్రమాల తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది.
క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ పోలీసుల విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారు. ఈ క్రమంలో క్వార్జ్‌ను తీసుకుని వెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు. చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్జ్‌ను తరలించడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
http://www.teluguone.com/news/content/court-allow-former-minister-kakani-to-police-custody-quartz-25-199445.html





