శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ సంచలనం.. తమిళనాట తెలుగులో ప్రచారం.. శివకాశికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు.. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, ఒక తెలుగు మహిళ సంచలన విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన సంపత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులు తలపడిన ఈ ఎన్నికల్లో ఒక సామాన్య నేపథ్యం ఉన్న తెలుగు మహిళ విజయం సాధించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. కీర్తన సంపత్ తన ఎన్నికల ప్రచారంలో అనుసరించిన వ్యూహం ఆమెను విజయతీరాలకు చేర్చింది. శివకాశి ప్రాంతంలో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె 'తెలుగు'నే ఆయుధంగా మలుచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మూలాలున్న కుటుంబాలతో ఆమె పెంచుకున్న ఆత్మీయ బంధం ఓట్ల రూపంలో మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత విజయ్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీర్తన సఫలమయ్యారు. విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలపై ఆమె ఇచ్చిన హామీలకు యువత మరియు మహిళా ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. శివకాశి లాంటి కీలకమైన పారిశ్రామిక నియోజకవర్గంలో పట్టు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఈ విజయంపై కీర్తన సంపత్ స్పందిస్తూ.. ఇది తన గెలుపు మాత్రమే కాదని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క తెలుగు మరియు తమిళ సోదర సోదరీమణుల విజయం అని పేర్కొన్నారు. శివకాశి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడులో నవశకం ప్రారంభమైందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ అభ్యర్థికి, అదీ తెలుగు ప్రచారంతో ఇంతటి ఆదరణ లభించడం విశేషం. ఇది భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో భాషా పరమైన వైవిధ్యానికి మరియు ప్రాంతీయ బంధాలకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ శివకాశి ముఖచిత్రాన్ని ఎలా మారుస్తారో చూడాలి. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన మరియు బాణాసంచా పరిశ్రమ కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆమె తక్షణమే దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక తెలుగు మహిళగా తమిళ అసెంబ్లీలో ఆమె గళం ఏ విధంగా వినపడనుందో వేచి చూడాలి.
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.  ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.  ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.  ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   
ALSO ON TELUGUONE N E W S
Actor Nithiin’s next exciting project has been officially launched with a traditional pooja ceremony. The film is being produced by the prestigious Sithara Entertainments, known for delivering quality and successful films and is directed by talented filmmakers Nari Sirisawada and Somasekhar T. With a strong creative team coming together, the project makes all of us look.  The film stars Nithiin in the lead role alongside Ritika Nayak as the female lead. The project brings together a skilled and dynamic crew including DOP Anith Madadi, Music Director Suresh Bobbili and Production Designer Jonny Shaik each contributing their expertise to craft a visually rich and engaging film. The film is being produced by the Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and fortune four cinemas and presented by Srikara studios. This combo is known for delivering quality and successful films.  The shoot is scheduled to commence from the second week of May with the team gearing up to begin production in full swing. Further updates regarding the project will be announced soon.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలెంటెడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆకర్షణీయమైన పోస్టర్‌ను పంచుకుంటూ, తన కొత్త ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. నారా రోహిత్ కెరీర్ లో 23వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చినమిల్లి మణికుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఒక వ్యక్తి మైక్‌లో ఏదో చెప్తున్నట్లు, అలాగే 'లిజన్', 'షౌటింగ్ సూన్' అనే పదాలతో ఆసక్తికరంగా ఉంది. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. నారా రోహిత్ తన కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో కూడా మరో వైవిధ్యమైన ప్రయోగానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.  చివరగా గతేడాది 'సుంద‌ర‌కాండ'తో ప్రేక్షకులను అలరించారు నారా రోహిత్. ఆ తర్వాత చాలా క‌థ‌లు విన్న ఆయన.. కొత్త ద‌ర్శ‌కుడు మ‌ణి కుమార్ చెప్పిన క‌థకు ఫిదా అయ్యి, దీనిని పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్  త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.   https://x.com/IamRohithNara/status/2051939111997686200
Nara Rohith has always carved a distinct niche for himself in Telugu cinema with his interesting script choices and his willingness to explore a diverse range of genres. Today marks another significant step in his career as his latest project, tentatively titled #RN23, officially went on floors with a formal launch ceremony. Moving away from heavy, intense dramas, the actor seems to be shifting his focus toward a lighter, more relatable space. This new venture is being billed as a wholesome romantic comedy and family entertainer. It is the fifth production from Karan C Productions LLP, bankrolled by Bharath Chowdary. Interestingly, Rohith is once again placing his trust in fresh talent by collaborating with debutant director Chinimilli Manikumar, who has also penned the story and screenplay for the film. The official launch today sets the wheels in motion for a project that aims to strike a chord with both youth and family audiences. For an actor who has built a reputation on unconventional narratives, stepping into a vibrant family drama offers a refreshing change of pace. With the regular shoot expected to commence soon, the industry will be watching closely to see how this new creative partnership translates onto the big screen.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఎండలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ సినీ తాజా న్యూస్ మాత్రం ఎప్పడు ఈ ముందు ఉంటాయి అనే రీతిలో ఎక్స్ క్లూజివ్ తెలుగు సినిమా న్యూస్ తమ సినీ పరిమళాల్ని మీ ముందు ఉంచాయి. అవేంటో చూద్దాం. 1. డ్రాగన్ కి జాయిన్ అయిన సంచలన దర్శకుడు దేవ కట్టా     మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంచలన దర్శకుడు దేవకట్టా  డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ కి దేవకట్టా పెట్టింది పేరు. కమర్షియల్ ఫ్లేవర్ ఉంటూనే సూటిగా, సుతిమెత్తగా, సమాజంలోని అన్ని వర్గాలకి చేరువయ్యేలా  దేవకట్టా డైలాగ్స్ ఉంటాయి. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అందుకే దేవకట్టాని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. మహేష్, రాజమౌళి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి కూడా  దేవకట్టా  డైలాగ్స్ అందిస్తున్న  విషయం తెలిసిందే . 2. రజినీ, కమల్ బడ్జెట్ వైరల్  ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ఖరీదైన మూవీ ఏదంటే రజినీ, కమల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పైగా  47 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనుండంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.ఇప్పుడు ఈ చిత్రం బడ్జెట్  టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంతి ప్రస్తుత ఎంఎల్ ఏ   ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు.  జైలర్ సిరీస్ ఫేమ్  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడనే విషయం తెలిసిందే. 3. పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్  పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్  బుకింగ్స్ మే 7రాత్రి 8 గంటలకి EST నుంచి  ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST ,  5 PM PST  షోస్ స్టార్ట్ కానున్నాయి.  EST , CST ,PST  అంటే ఓవర్ సీస్ లో ఉన్న ఏరియాస్. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు. రిలీజ్ కి  దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. పెద్ది   ఓవర్ సీస్ పంపిణి సంస్థ ప్రత్యంగిర సినిమాస్. 4.జాన్వీకపూర్ పెళ్లి తిరుపతిలో అనే వార్తలపై స్పందించిన బోనీ కపూర్  జాన్వీ కపూర్ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే.  జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు.జాన్వీ నెక్స్ట్ మంత్ 4 న పెద్దితో రానున్న విషయం తెలిసిందే. 5. ఎల్లమ్మలో మృణాల్ ఠాకూర్  బలగం వేణు, దేవిశ్రీప్రసాద్ కాంబోలో ఎల్లమ్మ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గోల్డెన్ లెగ్ అనే టాగ్ లైన్ తో మృణాల్ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మలో  మృణాల్ ఖాయమైతే కనుక మరింత క్రేజీ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఎల్లమ్మని హిట్ చిత్రాల మేకర్ దిల్ రాజు నిర్మిస్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  6.లెనిన్ నుంచి రిలీజైన భాగ్యశ్రీ బోర్సే లుక్ వైరల్   ఈ రోజు మోస్ట్ వాంటెడ్ అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు. ఈ సందర్భంగా అఖిల్ తో తాను చేస్తున్న లెనిన్ నుంచి మేకర్స్  భాగ్యశ్రీ  లుక్ ఒకదాన్ని రిలీజ్ చేసారు. సదరు లుక్ లో ఒక స్టేజ్ నాటకంలో రాజు వేషాన్ని తలపిస్తు భాగ్యశ్రీ ప్రదర్శిస్తున్న ఆహార్యం, గంబీరమైన రూపం ఫ్యాన్స్, నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లెనిన్ లో  భారతిగా కనిపించనుంది.  7.సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ క్రేజీ అప్ డేట్.. విలన్ రేసులో ఆ ఇద్దరు  సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే   రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా ప్రతి నాయకుడి క్యారక్టర్ కి మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, ధురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నాపేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ పేర్లు వైరల్ కావడంతో ఆ ఇద్దరిలో ఎవరైనా తమకి ఓకే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోకి దిల్ రాజు నిర్మాత అనే విషయం తెలిసిందే 8.నితిన్ , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రం స్టార్ట్    నితిన్, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది.  నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నితిన్ ని వరుస పరాజయాల నుంచి విముక్తి కల్పిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నితిన్ సరసన మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తుంది. కంటిన్యూ గా షూటింగ్ ని జరుపుకోనుంది. 99.బాలయ్య, కొరటాల శివ మూవీలో బాలీవుడ్ భామ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైన విషయం తెలిసిందే.  హీరోయిన్ గా బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాబాలన్ ఇంతకు ముందే బాలయ్యతో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో జతగా చేసి మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి జతకడితే  ఫ్యాన్స్ , ప్రేక్షకులకి అంతకంటే భాగ్యం మరొకటి ఉండదని చెప్పవచ్చు. మరి కొన్ని రోజులు అయితే గాని సదరు న్యూస్ పై ఫుల్ క్లారిటీ రాదు 10. మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక  ప్రకటన మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక  ప్రకటన వచ్చింది. సదరు ప్రకటనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోను కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ  'మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాత్రమే. కానీ కొంతమంది వ్యక్తులు మా పేరుని దుర్వినియోగం చేస్తు  కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి “AP MAA”, “MAA AP” మరియు ఇతర తప్పుదారి పట్టించే పేర్లని ఉపయోగిస్తున్నారు. వాటికి మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబంధం లేదని సుదీర్ఘ నోట్ రిలీజ్ చేసింది.  
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు, అనధికారిక బృందాలు 'మా' పేరును దుర్వినియోగం చేస్తూ ఆర్టిస్టులను మోసం చేస్తున్నట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ 'మా' ఒక నోట్ ను విడుదల చేసింది. గుర్తింపు పొందిన ఏకైక సంస్థ 'మా' మాత్రమే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నటీనటులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక అధికారిక సంస్థ 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' మాత్రమేనని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా 'మా' గుర్తింపు పొందింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలతో సమన్వయంతో పనిచేసే ఏకైక నటీనటుల సంఘం ఇది మాత్రమే. సభ్యుల ప్రయోజనాలను కాపాడటం, వారి గౌరవాన్ని నిలబెట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. నకిలీ 'MAA' పేర్లతో మోసాలు కొందరు వ్యక్తులు "AP MAA", "MAA AP" వంటి పేర్లతో నకిలీ సంఘాలను సృష్టించి, ఆర్టిస్టుల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు అసోసియేషన్ గుర్తించింది. "AP MAA" లేదా "MAA AP" పేరుతో ఎలాంటి అధికారిక సంస్థ లేదు. ఎవరి దగ్గరైనా డబ్బు వసూలు చేసే అధికారాన్ని 'మా' ఏ వ్యక్తికి లేదా బృందానికి ఇవ్వలేదు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 'మా' హెచ్చరించింది. ఆర్టిస్టులకు విజ్ఞప్తి నటీనటులెవరూ ఇలాంటి నకిలీ సంఘాల్లో సభ్యత్వాలు తీసుకోవద్దని, వారికి ఎలాంటి చెల్లింపులు చేయవద్దని 'మా' కోరింది. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే నేరుగా హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ లోని 'మా' కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆర్టిస్టుల ఐక్యతను, గౌరవాన్ని కాపాడుకోవడానికి అందరూ అప్రమత్తంగా ఉండాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.   
లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మించారు.  భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. * ‘సతీ లీలావతి’ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. మూవీ ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.  * ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో షూటింగ్ సాఫీగా చేశాను. ప్రతీ రోజూ షూటింగ్ అయిన తరువాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. చిత్రీకరణలో చిన్న చిన్న గాయాలు అవ్వడం అనేది కామన్ కదా. అయితే ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తాను. * నేను ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసేజ్ ఉన్నా కూడా ఏదో బోధిస్తున్నట్టుగా, క్లాస్ పీకుతున్నట్టుగా అనిపించదు.  * ‘సతీ లీలావతి’లో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను. * నేను ప్రెగ్నెంట్ కదా? అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది.  * రామ్ చరణ్ గారు మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఏమైనా హెల్ప్ చేయాలా? కావాలా? అని ఆయన అడుగుతుంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ రిలీజ్ చేయడంతో మాకు మరింత రీచ్ వచ్చింది. * దేవ్ మోహన్ గారు మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైన నటుడు. ఈ మూవీ కోసం డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉంటుంది. * చిరంజీవి గారు మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం.  * ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. నేను నా ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నాను. నా కొడుకుతోనే నాకు టైం సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. * సీనియర్ యాక్టర్ నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు ఇలా అందరూ అద్భుత పాత్రలు పోషించారు. చాలా ఎంటర్టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ గారి ‘సతీ లీలావతి’తో పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం వినోదాత్మకంగా సాగుతుంది. అదొక క్లాసికల్ చిత్రం. ఆ చిత్రంతో మా సినిమాని పోల్చకూడదు. * వరుణ్‌తో కలిసి నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉండాలి. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తాం.  
హీరో నితిన్ (Nithiin) తన తదుపరి సినిమాని అధికారికంగా ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ, నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.  ఈ చిత్రానికి దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మదాడి, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా జానీ షేక్ పని చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. భీష్మ, రంగ్‌దే తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నితిన్ చేస్తున్న సినిమా ఇది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.    https://x.com/SitharaEnts/status/2051943146448363838
టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' (Lenin) నుండి ఒక ప్రత్యేక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న 'భారతి' పాత్రకు సంబంధించిన బర్త్‌డే పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.  మెస్మరైజింగ్ లుక్‌లో భారతి తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో భాగ్యశ్రీ బోర్సే అత్యంత వైవిధ్యంగా కనిపిస్తోంది. నాటకంలోని రాజు పాత్రను తలపిస్తున్న ఆమె ఆహార్యం, గంభీరమైన రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు 'లెనిన్' మూవీ టీమ్ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసింది. భారతి పాత్ర అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.  జూన్ 26న విడుదల అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 26న 'లెనిన్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరూ కూడా ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'లెనిన్' రూపంలో వారు కోరుకుంటున్న విజయం దక్కుతుందేమో చూడాలి.  
    ఎందుకో తెలియదు గాని జాన్వీ కపూర్(Janhvi Kapoor)తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి  చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ చెప్పిన మాటలతో వాళ్ళు జాన్వీ పెళ్లి భోజనం తినాలని ఆశపడే వాళ్ళకి  టైం పట్టేలా ఉంది. బోనీ కపూర్ కపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే.  జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి రూమర్స్ సృషించ వాళ్ళకి 'బాగా చెప్పాడు కదా, అర్థమైందా, సరిపోయిందా అనే డైలాగ్స్ తో కూడిన మీమ్స్ ఎదురవుతున్నాయి.   Also read: Peddi: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST బోనీ కపూర్(Boney kapoor)చెప్పినట్టుగానే జాన్వీ పెద్ది(Peddi)తో బిజీగా ఉంది. దేవర తో అదరగొట్టిన జాన్వీ పెద్ది తో తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్థానంలో కూర్చోవాలని ఆశపడుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మా గా పెద్దిని తన అందంతో, చేష్టలతో  మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉంది. దీంతో ఆటోమేటిక్ గా ప్రేక్షకులు తన అధీనంలో ఉండటం పక్కా. తన కోరిక నెరవేరడం పక్కా . పెద్ది జూన్ 4 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 7 thనుంచి ఓవర్ సీస్ బుకింగ్ స్టార్ట్ కానున్నాయి.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' (Spirit) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వచ్చే ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం సన్నాహాలు తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం మే 7 నుండి రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ స్వయంగా ఈ ప్రిపరేషన్‌లో పాల్గొని, ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకోనున్నారు. ఈ భారీ సీక్వెన్స్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి మార్క్ యాక్షన్ 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న సందీప్ వంగా, 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చాలా 'రా'గా, 'ఇంటెన్స్‌'గా ఉంటాయని సమాచారం. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ ప్లాన్ చేశారట. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, 'స్పిరిట్' కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే రిహార్సల్స్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఈ 'స్పిరిట్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇక ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.  ఈ వేసవి కాలంలో అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం ఎండలో కూడా బయటకు వెళ్లాలి,  ఎండలో తిరిగి పనులు చేయాల్సి వస్తుంది.  చాలామంది బయటి పనులకు బైక్ వాడుతూ ఉంటారు. సాధారణ రోజులలో బైక్ ప్రయాణం ఏమంత సమస్య అనిపించదు. కానీ.. వేసవిలో,  తీవ్రమైన ఎండలో మాత్రం బైక్ ప్రయాణించే వారు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే వడగాలులు,  డీహైడ్రేషన్ సమస్య చాలా తొందరగా దెబ్బతీస్తాయి.  బైక్ రైడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. సరైన దుస్తుల ఎంపిక.. ఎండలో ప్రయాణించేటప్పుడు సురక్షితమైన దుస్తులు , హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. చెమట త్వరగా ఆవిరైపోయి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి తేలికైన, గాలి ప్రసరించే దుస్తులు ధరించాలి.  హెల్మెట్ సరిగ్గా బిగువుగా సరిపోయేలా ,  తలను ఎండ నుండి రక్షించేలా  ఉండేలా చూసుకోవాలి. నీరు..  తగినంత నీరు , ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిలో, శరీరం నుండి నీరు , ఖనిజాలు వేగంగా నష్టపోతాయి, దీనివల్ల డీహైడ్రేషన్ , బలహీనత ఏర్పడతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవడం శరీరంలోని నీరు , ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సమయం.. ఎక్కువ సేపు ఎండలో బైక్ డ్రైవ్ చేయడం మానుకుంటే మంచిది. తెల్లవారుజాము లేదా సాయంత్రం వంటి చల్లని సమయాల్లో బైక్ డ్రైవింగ్ మేలు. దీనివల్ల ఎండ వేడిమి, అలసట తగ్గుతాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్రాంతి.. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే..  బైక్ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి.  విశ్రాంతి తీసుకోవడానికి, శరీరాన్ని  చల్లార్చుకోవడానికి అక్కడక్కడా ఆగుతూ,  విశ్రాంతి తీసుకుంటూ వెళ్లడం మంచిది. ఎక్కువ సేపు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల శరీర వేడి పెరిగి అలసటకు దారితీస్తుంది. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం శరీరాన్ని కూల్ చేసుకోవడానికి, సురక్షితమైన ప్రయాణానికి సహాయపడతాయి. గ్లౌజులు,  సన్ స్క్రీన్.. తీవ్రమైన ఎండ  నుండి ప్రొటెక్షన్ కోసం సన్‌స్క్రీన్ , చేతికి గ్లౌజులు వాడాలి. సన్‌స్క్రీన్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో గ్లౌజులు  బైక్ నడుపుతున్నప్పుడు  చేతుల చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మం కాలిన గాయాలు , నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                               *రూపశ్రీ.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.