చార్మినార్ పై నీలినీడలు ... చారిత్రిక కట్టడాలపై పాలకుల నిర్లక్ష్యం ..
Publish Date:May 18, 2012
Advertisement
ప్రపంచఖ్యాత చార్మినార్ విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనబడుతోంది. ఈ నీలినీడలు ఆపేవారు లేరా అని చారిత్రికపరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నాలుగుస్తంభాల కట్టడం ఇండో-ఇరాన్ సంస్కృతుల మేళవింపు. నాటి రాచరికానికి అద్దం పట్టే ఈ కట్టడానికి నగిషీలే అందం అటువంటి నగిషీలు ఊడిపోతున్నాయి. సిమ్మెంటు పెచ్చులు మీద పడటంతో ఇటీవల చార్మినార్ పక్కనుంచి వెళ్ళే వాహన చోదకులూ గాయపడ్డారు. ఈ కట్టడాన్ని సంరక్షించేందుకు పురావస్తుశాఖ ఎటువంటి చర్యలూ చేపట్టకపోవటం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. క్రీ.శ. 1591లో సుల్తాన్ కులీకుతుబ్ షా దీన్ని నిర్మించారు. ఈయన కుతుబ్ షాహీవంశంలో ఐదొవాడు. చార్మినార్ నిర్మించాక తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు మార్చారు. ఈ కట్టడం ఒకేసారి వేలమంది ప్రార్థన చేసుకునేందుకు వీలైన మస్జీద్ గా ఇది పేరొందింది. ఇందులో నాలుగుస్తంభాలు ఉండటం వల్ల చార్ (నాలుగు) మినార్ (స్తంభాలు)గా ప్రపంచఖ్యాతి గడించింది. చరిత్రపుటల్లో హైదరాబాద్ సంస్థానం గురించి ప్రస్తావించాలంటే చార్మినార్ అందం గురించి చెప్పాల్సిందే. ఈ నిర్మాణానికి 1824లో మరమ్మత్తులు రూ. 60వేలతోనూ, మరో లక్షరూపాయలతో ప్లాస్టరింగ్, లైటింగ్ లు చేశారు. చార్మినార్ మార్కెట్టులో 14వేల షాపులున్నాయి. యాత్రికులను ఆకట్టుకునే హైదరాబాద్ ముత్యాలు, బంగారునగల వ్యాపారం జరిగే లాడ్ బజార్, ఫత్తర్ ఘట్టి చార్మినార్ కు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. కుతుబ్ షాహీ వంశస్థులు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పటికీ ఆ దేశరాజధాని కరాచీలోని బహాదూరాబాద్ లో ఓ మినీ చార్మినార్ ను నిర్మించారు. అయితే హైదరాబాద్ లోని చార్మినార్ కు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చారిత్రిక కట్టడాన్ని రక్షించేందుకు కృషి చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. టూరిజం శాఖకు చార్మినార్ పునర్నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే ఇంకా స్పందించలేదని చార్మినార్ కన్జర్వేషన్ అధికారి రషీద్ ఖాన్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/careless-on-charminar-24-14131.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





