Publish Date:Feb 20, 2026
సాధారణంగా మన ఇళ్లలో వాడే బియ్యం కిలో రూ. 50 నుండి రూ. 150 వరకు ఉంటుంది. బాస్మతి రకం బియ్యం అయితే అదనంగా మరో వంద ఉంటుంది. అయితే కిన్‌మెమాయ్ ప్రీమియం అనే ఒక ప్రత్యేక రకమైన బియ్యం ఉంది. దీని ధర వింటే కళ్లుబైర్లు కమ్మాల్సిందే. జపాన్‌కు చెందిన ఈ బియ్యం కిలో కొనాలంటే ఒక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనేంత డబ్బు వెచ్చించాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు లభించింది. మార్కెట్‌ను బట్టి కిలో బియ్యం ధర సుమారు 12 వేల 500 రూపాయల నుండి పదిహైను వేల రూపాయల వరకూ ఉంటుంది. కేవలం ధర మాత్రమే కాదు, దీన్ని పండించే విధానం, ప్రాసెసింగ్ పద్ధతి కూడా విలక్షణంగా ఉంటాయి. కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యం అనేది ఏదో ఒక రకమైన బియ్యం కాదు. జపాన్‌లోని గున్మా, నాగనో, నీగాటా వంటి ప్రాంతాల్లో పండే కోషిహికారీ, పికామారు వంటి ఐదు రకాల మేలైన బియ్యం రకాలను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ కలయిక దాని ప్రత్యేకతకు ప్రధాన కారణం.
దీని ఉత్పత్తిలో ఆరు నెలల నిరీక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యం కోత కోసిన వెంటనే మార్కెట్‌లోకి రావు. వీటిని దాదాపు ఆరు నెలల పాటు ప్రత్యేక పరిస్థితులలో నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బియ్యం రుచి, ఆకృతి గణనీయంగా మెరుగుపడతాయని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతోంది. ఇది దాని ప్రత్యేకమైన రుచికి, నాణ్యతకు పునాది వేస్తుంది. ప్రత్యేక పాలిష్ విధానం కూడా కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యానికున్న మరో ప్రత్యేకత. దీని కోసం పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన బఫింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి బియ్యం పైపొరను తొలగించినప్పటికీ, అందులోని ముఖ్యమైన పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా కాపాడుతుంది. దీని వల్ల బియ్యం సహజసిద్ధమైన మంచి గుణాలను నిలుపుకుంటుంది.
అద్భుతమైన రుచితో అలరారే ఈ బియ్యంతో అన్నం వండితే అది స్పటికంలా మెరుస్తుంది. దీని రుచి కొంచెం తియ్యగా, వెన్నలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుందని బియ్యం రుచి చూసిన భోజన ప్రియులు చెబుతారు. ఈ ప్రత్యేకమైన రుచి అనుభవం దీనిని సాధారణ బియ్యం నుండి వేరు చేస్తుంది. కిన్‌మెమాయ్ ప్రీమియం బియ్యం లగ్జరీ గిఫ్ట్‌గా ప్రాచుర్యం పొందింది. టోయో రైస్ కార్పొరేషన్ ఏడాదికి కేవలం 1000 బాక్సులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిమిత ఉత్పత్తి దాని విలువను మరింత పెంచుతోంది. జపాన్‌లో దీన్ని ప్రతిరోజూ తినే ఆహార పదార్థంగా కాకుండా, అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కానుకగా ఇతరులకు ఇస్తుంటారు. ఒక సాధారణ ఆహార పదార్థం కూడా సరైన నైపుణ్యం, ప్రత్యేక పద్ధతులు తోడైతే ఎలా గిన్నిస్ రికార్డు సృష్టిస్తుందో చెప్పడానికి కిన్‌మెమాయ్ ప్రీమియం ఒక నిదర్శనం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/costliest-rice-in-world-36-214366.html
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.