తెలంగాణ అభివృద్ధికి సహకరించండి : సీఎం రేవంత్

Publish Date:May 10, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. అభివృద్ధి ఉత్సవమని సీఎం పేర్కొన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ముందు దేశం.. తర్వాత ప్రజలు.. ఆ తర్వాతే పార్టీ అనే స్పష్టమైన దృక్పథంతో తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రధాని ప్రకటించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి తాము భాగస్వాములయ్యామని చెప్పారు. తెలంగాణ రైజింగ్‌కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని ప్రయత్నిస్తున్నామని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల కోసం ప్రధాని వచ్చినట్లు తెలిపారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో మీరు ‘గుజరాత్ మోడల్’ను అభివృద్ధి చేశారని రేవంత్ గుర్తుచేశారు. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. మన్మోహన్ సింగ్ చూపిన స్ఫూర్తితో మీరు కూడా పూర్తి సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు మన్మోహన్ సింగ్ ఆశీస్సులు అందించినట్లే, తెలంగాణ ప్రజలకు కూడా మీరు ఆశీస్సులు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.భారీ ఆర్థిక వృద్ధి మహానగరాల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఆరు మహానగరాలు దేశ అభివృద్ధికి కేంద్ర బిందువులని అన్నారు. దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలంటే ఈ మెట్రో నగరాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.“మోదీ గారూ.. నా రాష్ట్రం, నా ప్రజల కోసం నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు అవసరం” అని సీఎం తెలిపారు. మూసీ నది అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం మధ్య 12 లైన్ల రహదారి వంటి అంశాలపై రెండు గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ మీకు పెద్ద మనసు ఉందని చెబుతున్నారని.. తెలంగాణ ప్రజలు కూడా అదే నమ్మకంతో ఉన్నారని సీఎం అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఈరోజే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు.“దేశ ప్రయోజనాల విషయంలో మేము ఎప్పుడూ మీతో కలిసి ఉంటాం. మీరు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు.. మేము కూడా రాష్ట్ర స్థాయిలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ను దానికి అనుసంధానం చేశాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.