రాష్ట్రంలో శాంతిని దెబ్బతీసి, మత విద్దేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశ పూర్వకంగా కుట్ర పన్నుతున్నాయా అంటే సీనియర్ నటుడు నరేష్ ఔననే అంటున్నారు. ఆయన తాజాగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఒక పోస్టు సంచలనంగా మారింది. ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
ఆ ట్వీట్ లో నటుడు నరేష్ ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రగతికి ఇటువంటి మత రాజకీయాలు అవరోధంగా మారుతాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదని, సమాజాన్ని మత విద్వేషాలతో అపవిత్రం చేయవద్దని పిలుపునిచ్చారు. ఒక సీనియర్ నటుడిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా తాను ఈ విషయాలపై స్పందించానని పేర్కొన్న నటుడు నరేష్.. ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాల వెనుక ఉన్న అసలు శక్తులను ప్రజలు గుర్తించాలన్నారు.
దళిత, క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మత రాజకీయాల వెనుక ఓట్ల వ్యూహాలు దాగి ఉన్నాయనీ, కులాల విభజనతో సరిపెట్టకుండా.. ఓట్ల వేట కోసం మతాలను కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ నటుడు నరేష్ చేసిన ఈ ట్వీట్‌ను నెటిజన్లు సమర్థిస్తున్నారు.
Actor Naresh Tweet, AP Religious Politics, Andhra Pradesh Political News, Naresh Sensational Comments
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/conspiracy-to-incite-religious-hatred-in-ap-36-225239.html
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ వచ్చే 12 నెలల్లో 1,00,000 మార్కును తాకే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ తదుపరి భారీ ర్యాలీకి కారణమయ్యే బుల్, బేస్, బేర్ కేస్ సినారియోల పూర్తి వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!