తెలుగుదేశాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ సిఎంలు? రాజశేఖరరెడ్డి తరువాతి స్థానంలో కిరణ్!
Publish Date:Sep 30, 2012
Advertisement
తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీనేతలు దెబ్బతీశారు. ఎన్నికల్లో ఓటమి పాలు చేయటమే కాకుండా సిఎంగా పీఠమెక్కాక కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కట్ల పాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించటమే ప్రధానపనిగా పెట్టుకున్న దివంగత సిఎం రాజశేఖరరెడ్డి గురించి ఈ విషయంలో ఒకసారి ప్రస్తావించక తప్పదు. ఆయన అధికారంలోకి రావటం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించారు. అలానే భూమా దంపతులు వంటివారు కాంగ్రెస్‌లోకి వలస వచ్చేశారు. ఆయన తరువాత ఇదే పథకాన్ని అమలు చేసి తెలంగాణాలోని సమ్మారి సాంబయ్యను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి ఏకంగా పార్టీ తరుపున పోటీకి నిలబెట్టారు. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేత. అలానే సిఎం కిరణ్ చిన్నం రామకోటయ్య వంటి ప్రముఖులను ఆకర్షించేందుకు కృషి చేశారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు అంటే ప్రాణం అన్నట్లుండే మాజీ ఛైర్మన్ శంకరరెడ్డిని కాంగ్రెస్ తరుపున పని చేసేందుకు సిఎం మద్దతు కోరారు. ఆయనకు పార్టీ తీర్థం ఇచ్చి మరీ పని చేయించుకున్నారు. తాజాగా టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర సాధన కమిటీ అధ్యక్షుడు బైర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కూడా సిఎం కిరణ్ ఆకర్షిస్తున్నారు. బైర్రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకునేందుకు ఇప్పటికే సిఎం ఏర్పాట్లు చేశారని తెలిసింది. ఇలానే మరికొందరిని సిఎం కిరణ్ టార్గెట్ చేశారని తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి తరువాత సిఎం పీఠాన్ని ఎక్కిన కిరణ్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రచించిన వ్యూహం మరిన్ని సత్ఫలిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
http://www.teluguone.com/news/content/congress-wrecking-tdp-24-17780.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





