Publish Date:Jan 28, 2026
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే హెచ్చరించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నేరుగా పేరు ప్రస్తావించనప్పటికీ కోమటి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సొంత నియోజకవర్గమైన మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే, ఏదో ఒక రోజు తాను బాంబు పేల్చడం ఖాయమని ఏకంగా సొంత పార్టీ ప్రభుత్వానికే హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చి మూడు వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదన్న ఆయన, తనకు పదవి రాకున్నా పర్వాలేదు కానీ ప్రజల సమస్యలు తీరకపోతే మాత్రం ఎంతకైనా వెడతానని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-senior-leader-komatireddy-rajagoplreddy-worning-revanthreddy-government-25-213119.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.