తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష  మరో సారి చర్చనీయాంశంగా మారారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ  ఆమె అభిమానులు త్రిష పేరుమీద   కొత్త వేదికను ప్రారంభించారు.  అక్కడితో ఆగకుండా ఆమెను దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు ఉన్న  పురట్చి తలైవి బిరుదును గుర్తుచేసేలా,  ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చకు తెర లేచింది.  ఈ వేదిక నిర్వాహకులు విడుదల చేసిన వివరాల ప్రకారం..  త్రిష వ్యక్తిత్వం, దృఢత్వంలో జయలలిత లక్షణాలు కనిపిస్తాయి.   తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే  ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే..  భవిష్యత్తులో విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ ప్రయాణం చేస్తే..  రాష్ట్రంలో జయలలిత తరహా  పాలన వస్తుందన్నది ఆ వేదిక నిర్వాహకుల అభిప్రాయం.   ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ, త్రిష రాజకీయ ప్రవేశానికి అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా,  ఆమెకు ఈ వేదికతో   ప్రత్యక్ష సంబంధం ఉందా అనే అంశాలపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.  ఇప్పటివరకు నటి త్రిష స్వయంగా రాజకీయ ప్రవేశంపై గానీ, టీవీకే పార్టీలో చేరడంపై గానీ   అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.  కేవలం అభిమానుల ఆకాంక్షలు, కొత్త వేదిక ప్రారంభోత్సవ ప్రకటనల ఆధారంగానే ఈ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో పాటు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన చర్చలూ తెరపైకి వచ్చాయి. గతంలో జయలలిత పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించినప్పటికీ..  ఆ ప్రాజెక్ట్ లేదా నటీనటుల ఎంపికపై ఎటువంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ.. జయలలితతో పోలికలు, బయోపిక్ ప్రస్తావనలు కలగలిసి త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి.  ఇది కూడా చదవండి:  త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే! దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.  , సినిమా షూటింగ్‌లు, వృత్తిపరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉండే త్రిష ఈ ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.  ఏది ఏమైనా రానున్న రోజులలో ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  తరఫున చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.  మొత్తంగా  జయలలిత వారసత్వం, సీఎం విజయ్‌తో రాజకీయ ప్రయాణ అంచనాల నేపథ్యంలో త్రిష పేరు చుట్టూ మొదలైన చర్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ ను పెంచింది.  మీకు నచ్చవచ్చు:  విజయ్ ఇంటికి త్రిష.. సిఎం అవ్వబోతున్నాడా! విజయ్ ఈవెంట్‌లో త్రిష సడన్ ఎంట్రీ.. ఊహించని ట్విస్ట్‌తో షాక్ తిన్న ఫ్యాన్స్! [Actress Trisha, olitical Entry, Jayalalitha, Successor, Ilaiya Puratchi Thalaivi, Trisha Peravai, TeluguOne] 
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది. మహా పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కరీంనగర్‌లో కనిపిస్తున్న కాషాయ ప్రభంజనాన్ని చూసి తన మనసు పులకించిపోతోందని అన్నారు. తనను కన్న కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టడంతో తన గుండె ఉప్పొంగుతోందన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, భుజాన ఉన్న కాషాయ జెండా కోసం ఎంతవరకైనా పోరాడతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ తన కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు.. కరీంనగర్‌లో కనిపిస్తున్న జన ప్రభంజనాన్ని చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధంగా ఉందని అన్నారు. నితిన్ నబిన్‌పై బండి సంజయ్ ప్రశంసల వర్షం.! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బండి సంజయ్ కొనియాడారు. ఆయన సాధారణ నాయకుడు కాదని, కొదమసింహం అంటూ అభివర్ణించారు. నబిన్ చూపుల్లో పదును ఉందని, ఆయన పక్కన నిలబడితేనే వేడి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబిన్ అంటే నూతనత్వమని అభివర్ణించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై, ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా నితిన్ నబిన్ ఎదిగారని గుర్తుచేశారు. 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒక సామాన్య కార్యకర్త పార్టీని నడిపించే స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమని పేర్కొన్నారు. నితిన్ నబిన్‌కు చిన్నతనంలో రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనుకున్నారని బండి సంజయ్ చెప్పారు. అయితే ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, దేశం కోసం పనిచేయాలనే అంకితభావమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తుచేస్తూ..! తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కార్యకర్తలు ఏళ్ల తరబడి పోరాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండాను మోస్తూ కార్యకర్తల భుజాలు కాయలు కాశాయని, లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు. SIR, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌కు ప్రశ్నలు.! ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ SIR ప్రక్రియను వ్యతిరేకించడంపై ప్రశ్నలు సంధించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు, అర్హత లేని ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చినవారికి ఓటు హక్కు కల్పించడం సరికాదని, అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండాలని అన్నారు. విదేశీ చొరబాటుదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొందుతూ స్థానిక ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా బీజేపీ వెనక్కి తగ్గదని అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌పై మోదీ పోరాటానికి మద్దతివ్వాలని పిలుపు.! దేశంలో డ్రగ్స్ సమస్య యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితిని చూసి ప్రధాని మోదీ ఆవేదన చెందుతున్నారని చెప్పారు. నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయన్న అంచనాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అందరికీ అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మహా పాదయాత్ర: రాంచందర్ రావు  మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ మహా పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు SIR ప్రక్రియ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎనిమిదిసార్లు SIR జరిగినా అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రాంచందర్ రావు విమర్శించారు. మోదీ ఎన్నిక చెల్లదంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. విదేశీ శక్తులతో కలిసి భారత్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహా పాదయాత్ర లక్ష్యమని రాంచందర్ రావు స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: Gen z:  24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌.. టీడీపీ కూటమి సంచలన నిర్ణయం.! మీకు నచ్చవచ్చు: ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!     [ Karimnagar BJP Maha Padayatra, Nitin Nabin, Bandi Sanjay, BJP Telangana, N Ramchander Rao, Rahul Gandhi, SIR Controversy ]  
తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాదు, పునర్వ్యవస్థీకరణే అంటే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది.  రాష్ట్రంలో  రేవంత్ సర్కార్  మూడేళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో, రాష్ట్రంలో మరో డిప్యూటీ సీఎం పదవి అంశం తెరపైకి వచ్చింది.   తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభుత్వం, పార్టీ యంత్రాంగంలో కీలక మార్పులు చేసేందుకు సమాయత్తమౌతోందని అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నదని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు తరచుగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్న తీరును సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ప్రస్తుత మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చేసింది.   2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు కేబినెట్ పోర్టుపోలియోల్లోనూ కూడా భారీ మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తలు జోరుగా వినిపింయాయి. అయితే అరకొర మార్పులు కాకుండా సమగ్ర ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో హైకమాండ్ కేబినెట్ పునర్యవస్థీకరణ అంశాన్ని అప్పటికి పక్కన పెట్టింది.  త్వరలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరగనుంది. అది పూర్తయిన వెంటనే రేవంత్ కేబినెట్ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎంపికయ్యే ఎమ్మెల్సీలలో ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.  మల్లు భట్టి విక్రమార్కకు తోడుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు మరో డిప్యూటీ సీఎం పదవిని కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.   ఇది కూడా చదవండి:   వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే? రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో   కీలక వాటా దక్కాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఆ డిమాండ్ ను నెరవేర్చే ఉద్దేశంతో హైకమాండ్ రెండో ఉప ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.  భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండో ఉపముఖ్యమంత్రి అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.   సామాజిక సమతుల్యతను కాపాడుతూనే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పునర్వ్యవస్థీకరణతో పార్టీలో అసమ్మతి, అసమ్మతి గళాలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని అంటున్నారు.  ఏది ఏమైనా వచ్చే నెల రెండో వారం నాటికి కేబినెట్ రీషఫుల్, రెండో ఉప ముఖ్యమంత్రి, పార్టీ పదవులలో మార్పులు తదితర అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మీకు నచ్చవచ్చు:  రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ? రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?​ [Raventh, Cabinet Reshuffle, SecondDeputyCM,  Highcommand, Strategy, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కాకా'. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు మేకర్స్ మరో క్రేజీ అప్డేట్‌కు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ పాట ఎప్పుడు రాబోతోంది? అభిమానులకి  ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూద్దాం.   'కాకా' సినిమా నుంచి వచ్చే మొదటి పాటను డిసెంబర్‌ చివరిలో అమెరికాలో విడుదల చేయాలని మేకర్స్ గతంలోనే ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సాంగ్ రిలీజ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ మొదటి వారాంతంలోనే ఫస్ట్ సింగిల్‌  విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పాట విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఆ ఫస్ట్ సింగల్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తుండగా 'గాడ్ ఫాదర్' తర్వాత చిరంజీవితో థమన్ చేస్తున్న మరో పూర్తి స్థాయి సినిమా కావడంతో సంగీతంపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా అంటే పాటలు, డ్యాన్సులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈసారి థమన్ ఎలాంటి బీట్‌తో మెగాస్టార్‌ను చూపించబోతున్నారు? ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుందా? లేక మెలోడీతో ఆకట్టుకుంటుందా? అన్నది చూడాలి. పాట విడుదలైతే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.   ఇది కూడా చదవండి:100 డేస్ ఆడిన చివరి సినిమా అదే: కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయంట.. పోసాని మళ్ళీ వచ్చేసాడు! చిరంజీవిని దర్శకుడు బాబీ సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇందులో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె క్యారక్టర్ కి కథలో మంచి ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను కె. సత్యం అనే మధ్యతరగతి వ్యక్తిగా పరిచయం చేశారు. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే పాత్రలో మెగాస్టార్ కనిపించారు. అయితే ఆ గ్లింప్స్ చివర్లో వచ్చిన ట్విస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. కాకా 2027 జనవరి 13న సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.   మీకు నచ్చవచ్చు: డింపుల్‌ హయాతి పెళ్లి                                ఆ హీరో సినిమాపై పోసాని వ్యాఖ్యలు వైరల్: చివరి 100 డేస్ అదేనంట!    [Kaaka, Chiranjeevi, Anaswara Rajan, Tollywood, Bobby]
రచయితగా, నటుడుగా, దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి  తెలుగు ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అక్షర దోషం లేదు. కాకపోతే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో తన చరిత్రకి గతమెంత ఘనంగా మారింది. అంటే నో సినిమాస్, ఏదో అడపా దడపా కనిపిస్తూ ఉన్నా ఆ చిత్రాలన్నీ ఉదయాన్నే థియేటర్స్ లో కనిపిస్తున్నాయి కానీ సాయంత్రానికి ఏమై పోతున్నాయో తెలియని పరిస్థితి.  రీసెంట్ గా పోసాని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు శ్రావణమాసం ఫ్లాప్ అయిన తర్వాత, ఒక ప్రముఖ దర్శకుడు పోసాని ఇంటికి వచ్చి, ఆయనకు సినిమాలు తీయడం ఎందుకు, డబ్బులన్నీ పోయాయని, ఇక ఖర్చులకు ఏం చేస్తారని అన్నారని పోసాని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తనను బాధించినప్పటికీ, వాటిని ఒక సవాల్‌గా స్వీకరించానని, సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి శూన్యంగా మారడని పోసాని గట్టిగా విశ్వసించారు. మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా అనేక ఫ్లాపులను చవిచూశారని, అయినా ఆయన ఇప్పటికీ ఒక లెజెండరీ డైరెక్టర్ గానే కొనసాగుతున్నారని, కమల్ హాసన్ సినిమాలు కొన్నిసార్లు సబ్జెక్ట్ లోపాల వల్ల ఫ్లాప్ అవుతాయి తప్ప, ఆయన ప్రతిభకు లోపం కాదని అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. టెక్నిక్ పట్ల ఆయనకు ఉన్న పట్టు, షార్ప్‌నెస్, క్రియేటివిటీ మరెవరికీ లేవని ప్రశంసించారు. తాను రెండేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించినందున ఆయన ప్రతిభను దగ్గరగా చూశానని, రామ్ గోపాల్ వర్మ ఒక జీనియస్ అని అన్నారు. శ్రావణమాసం ఫ్లాప్ తర్వాత, తాను తన ఫైనాన్షియర్‌కు ఒక ఆస్తిని అమ్మి డబ్బులు తిరిగి ఇచ్చేశానని పోసాని తెలిపారు. ఆ తర్వాత, మళ్లీ సినిమా తీసేందుకు అదే ఫైనాన్షియర్ వద్దకు వెళ్లగా, వారు ఎటువంటి సంకోచం లేకుండా మీకు కావాల్సినంత తీసుకోండి మురళి గారు. మీకు సినిమా ఫ్లాప్, హిట్ మాకేమీ లేదు, అంతకుముందు క్లియర్‌గా కట్టారు కదా అని చెప్పి ఆర్థిక సహాయం అందించారని పోసాని గుర్తు చేసుకున్నారు. అది వారి నమ్మకానికి, పోసాని నిజాయితీకి నిదర్శనం. ఇది కూడా చదవండి: డింపుల్‌ హయాతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్ గా అందరకి అర్థమైంది! ఆ తర్వాత పోసాని తన సొంత కథతో ఆపరేషన్ దుర్యోధనను రూపొందించారు. ఫైనాన్షియర్ కథ విన్న తర్వాత ఇది మీరే చెప్పాలి, మీరే చేయాలనుందా, నేను చేసుకోవచ్చా అని అడిగినట్లు, కథలోని దమ్ము ఆయనకు అర్థమైందని పోసాని వివరించారు. అలా ప్రారంభమైన ఆపరేషన్ దుర్యోధన అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ అయిందో, కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయని పోసాని అన్నారు.  తెలుగు సినీ చరిత్రలో ఒక రికార్డును సృష్టించింది. అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిన చివరి తెలుగు చిత్రంగా ఆపరేషన్ దుర్యోధన నిలిచిందని పోసాని సగర్వంగా ప్రకటించారు. ఆ తర్వాత వంద రోజులు ఆడిన సినిమాలు ఏవీ లేవని, ఆ ట్రెండ్ కూడా లేకుండా పోయిందని తెలిపారు. తనను విమర్శించిన వారందరికీ ఈ విజయం సమాధానం చెప్పిందని, ఒక ఫ్లాప్ సినిమాతో ఎవరినీ తీసిపారేయకూడదని ఈ సంఘటన రుజువు చేసిందని పోసాని కృష్ణమురళి వివరించారు.  మీకు నచ్చవచ్చు: బాస్ టీజర్ వచ్చేసింది: ఫ్యాన్స్ లో పూనకాలు!                                ఆ డైరెక్టర్ తో అడివి శేష్: హీరోయిన్ ఎవరో తెలుసా!     [Posani Krishna Murali,operation Duryodhana, Tollywood, Ram gopal varma]                                    
సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి విజయం సాధించిన విజయ్.. నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకున్నారు. ఫలితంగా అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఖాళీ అయిన ఈ స్థానంలో టీవీకే తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఆమెను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొందరు త్రిష అభిమానులు 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' పేరుతో కొత్త సంస్థను ప్రారంభించడం కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. గతంలో తన పేరుతో రాజకీయ ప్రచారం జరిగినప్పుడు వెంటనే స్పందించే త్రిష.. ఈసారి మాత్రం మౌనంగా ఉండటం చర్చకు కారణమవుతోంది. మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి త్రిష పేరును పార్టీలోని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ సలహాదారులు ఆమెను నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడం కంటే రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.! తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం టీవీకేకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో త్రిష వంటి పాపులర్ సినీ తారను బరిలోకి దింపితే పార్టీకి ప్రచారపరంగా ప్రయోజనం ఉంటుందని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి ఈ ప్రచారాలన్నీ నిజమవుతాయా? త్రిష నిజంగానే విజయ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక ఆమె పేరు రాజకీయ చర్చలకే పరిమితం అవుతుందా? దీనిపై టీవీకే అధిష్ఠానం నుంచి వచ్చే అధికారిక ప్రకటనే స్పష్టత ఇవ్వనుంది. మీకు నచ్చవచ్చు: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే రామాయణ సినిమా చూసే ఛాన్స్.!       [Trisha Politics, TVK Candidate, Tiruchirappalli East, By Election, CM Vijay]  
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ హైదరాబాద్‌లో సందడి చేశారు. తన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ ప్రమోషన్ల కోసం నగరానికి వచ్చిన ఆయన.. అమీర్‌పేట వీధుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చిత్ర బృందంతో కలిసి సాధారణ వ్యక్తిలా వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన విజయ్ ఆంటోనీ, ఓ మిర్చి బజ్జీల బండి వద్ద ఆగారు. అక్కడ స్వయంగా మిర్చి బజ్జీలు వేయడం మొదలుపెట్టారు. తన అభిమాన హీరో ఇలా రోడ్డుపై బజ్జీలు తయారు చేయడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన బజ్జీలు వేస్తున్న దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా విజయ్ ఆంటోనీ తన చేతులతో తయారు చేసిన మిర్చి బజ్జీలను అభిమానులకు, స్థానికులకు పంచిపెట్టారు. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ప్రమోషన్ల కోసం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ఇలా నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారితో సరదాగా గడపడం విశేషం. ఆ తర్వాత ఏషియన్ సత్యం మాల్ సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లిన విజయ్ ఆంటోనీ.. అక్కడ చాయ్ తాగుతూ బన్ మస్కా రుచి చూశారు. హోటల్‌లో ఉన్నవారితోనూ సరదాగా ముచ్చటించారు. ఆయనను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఆసక్తి చూపించారు. సుమారు అరగంటపాటు సాగిన ఈ పర్యటనతో అమీర్‌పేట పరిసరాల్లో సందడి నెలకొంది. ఇది కూడా చదవండి: ఇరాన్‌ గాయని, ఆమె బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష.. అసలేం జరిగింది.! ఇటీవలే చెన్నై నుంచి కోయంబత్తూరుకు జనరల్ బోగీలో ప్రయాణించి వార్తల్లో నిలిచిన విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇలా సాధారణ వ్యక్తిలా కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సినిమాల ప్రచారంలోనూ విభిన్నమైన పద్ధతులను అనుసరిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఆయన సింప్లిసిటీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ నటించిన ‘నాన్న కుట్టి’ సినిమా నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ప్రమోషన్లలో భాగంగా స్టార్ హోటళ్లకు పరిమితం కాకుండా అమీర్‌పేట వీధుల్లో మిర్చి బజ్జీలు వేయడం, బన్ మస్కా తినడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. మీకు నచ్చవచ్చు:  ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో భార‌త్‌కు నిరాశ‌.. విజేత‌లు ఎవ‌రంటే.? డింపుల్ హయతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్‌గా అందరికీ అర్థమైంది.!   [VijayAntony, VijayAntonyAmeerpet, Bichagadu, NannaKutti, PreethiAsrani]
హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో మెరిసే ముద్దుగుమ్మగా అభిమానులని, సినీ ప్రియులని తన చూపులతో కట్టేసే భామ డింపుల్‌ హయాతి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో 'నారాయణమ్మ' సాంగ్ తో తన బాధ చెప్పుకుంది. ఈ నెల 27 న శర్వానంద్ తో కలిసి 'భోగి' తో హీరోయిన్ గా పలకరించనుంది.   భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మందారం రంగు చీరలో  హాజరైన డింపుల్ తన అందంతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇదే క్రమంలో హీరో శర్వానంద్‌తో మరింత క్లోజ్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఓ నెటిజన్‌.. డింపుల్‌కు కూడా పెళ్లయిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. దీనికి హీరోయిన్ డింపుల్ హయాతి కూడా వెంటనే స్పందించింది. ‘ఐ యామ్ నాట్ మ్యారీడ్ అంటూ రిప్లై ఇచ్చింది. తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ డింపుల్‌ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శర్వానంద్‌తో కాస్తా క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయిందా అని అడుగుతారా అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా డింపుల్ కు పెళ్లయిపోయిందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.అయితే మొత్తానికి ప్రస్తుతానికి తాను సింగిల్‌ అని మాత్రం డింపుల్ క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే డింపుల్ గతంలో  ఒక అపార్ట్ మెంట్ లో  తనకి క్లోజ్ గా ఉన్న వ్యక్తితో కలిసి మరొకరితో గొడవపడుతున్న వీడియోని కూడా పనిలో పనిగా కొంత మంది షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చిరు పేరులో N  ఎందుకు లేదో ప్రోమో రిలీజ్ చేసారు: ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే! ‘భోగి’ చిత్రంలో డింపుల్ హయాతి ‘మందారం’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇప్పటివరకు తనపై ఉన్న గ్లామర్ ఇమేజ్‌ను ఈ సినిమా పూర్తిగా మార్చేస్తుందని డింపుల్ చెబుతోంది. రిలీజ్ కి  అన్ని హంగులు పూర్తి చేసుకున్న భోగి ఈ శుక్రవారం ఏ మేర  థియేటర్లలో సందడి చేస్తుందో చూడాలి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కి  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.         మీకు నచ్చవచ్చు: అడవి శేష్ సరసన ఆ క్రేజీ  హీరోయిన్                                ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఎగిరి గంతేయ్యడం ఖాయం!   [Dimple Hayathi, Bhogi, Sharwanadh, Tollywood, Anupama Parameswaran]
న్యూయార్క్‌లో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈసారి మన దేశం నుంచి రెండు ఎంట్రీలు పోటీలో నిలిచాయి. ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ నటించిన నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ ‘వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్’, సోనీ లివ్‌లో వచ్చిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ సిరీస్‌ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. అయితే ఈ రెండింటికీ పురస్కారాలు దక్కలేదు. కామెడీ విభాగంలో వీర్ దాస్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఆయన ‘ఫూల్ వాల్యూమ్’కు బదులుగా అర్జెంటీనాకు చెందిన ‘డివిజన్ పాలెర్మో – సీజన్ 2’ ఉత్తమ కామెడీ సిరీస్ అవార్డును గెలుచుకుంది. 2023లో ‘వీర్ దాస్: ల్యాండింగ్’తో ఎమ్మీ అవార్డును అందుకున్న వీర్ దాస్‌కు ఇది మూడో నామినేషన్. ఇక ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ పోటీ పడింది. మానవ్ కౌల్, మహమ్మద్ జీషన్ అయ్యుబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌.. ఫ్రాన్స్‌కు చెందిన ‘కారేమ్’తో పోటీలో నిలిచింది. చివరకు ‘కారేమ్’ ఉత్తమ డ్రామా సిరీస్‌గా అవార్డును సొంతం చేసుకుంది. రాజేష్ మాపుస్కర్, మహేష్ మథాయ్ దర్శకత్వం వహించిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ నిజ జీవితంలోని ఫుట్‌బాల్ క్లబ్ ప్రయాణం ఆధారంగా రూపొందింది. ఇది కూడా చదవండి: ఇరాన్ గాయని, ఆమె బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష.. అసలేం జరిగింది.! ఈ ఏడాది ఎమ్మీ అవార్డుల్లో బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రొడక్షన్స్‌ ఎక్కువ పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా ‘అన్‌ఫర్గివబుల్’లో నటించిన బాబీ స్కోఫీల్డ్, ఉత్తమ నటిగా ‘హోలీ షిట్’లో నటించిన మోనా మినా లియోన్‌ ఎంపికయ్యారు. ఉత్తమ టీవీ మూవీ/మినీ సిరీస్‌గా ‘ప్రిజనర్ 951’, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘లూయిస్ థెరౌక్స్: ది సెటిలర్స్’ నిలిచాయి. ఉత్తమ డ్రామా సిరీస్: Carême – ఫ్రాన్స్ ఉత్తమ కామెడీ సిరీస్: División Palermo – Season 2 – అర్జెంటీనా ఉత్తమ నటుడు: Bobby Schofield – Unforgivable – బ్రిటన్ ఉత్తమ నటి: Mona Mina Leon – Holy Sh!t – బెల్జియం ఉత్తమ టీవీ మూవీ/మినీ సిరీస్: Prisoner 951 – బ్రిటన్ ఉత్తమ డాక్యుమెంటరీ: Louis Theroux: The Settlers – బ్రిటన్ ఉత్తమ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్: Der Talentierte Mr. F – జర్మనీ ఉత్తమ కరెంట్ అఫైర్స్: Exposure: Breaking Ranks: Inside Israel’s War – బ్రిటన్ ఉత్తమ వార్తా కార్యక్రమం: The World: 24 Hours in the Kill Zone – బ్రిటన్ ఉత్తమ నాన్-స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్: Educating Yorkshire – Season 2 – బ్రిటన్ ఉత్తమ షార్ట్-ఫార్మ్ సిరీస్: De Klas van 2000 – బెల్జియం ఉత్తమ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ: The Philipstown Wirecar Grand Prix – దక్షిణాఫ్రికా ఉత్తమ టెలినోవెలా: Leyla – టర్కీ పిల్లల యానిమేషన్: The Scarecrows’ Wedding – బ్రిటన్ పిల్లల ఫ్యాక్చువల్/ఎంటర్‌టైన్‌మెంట్: Horrible Science – బ్రిటన్ పిల్లల లైవ్-యాక్షన్: Dexter Procter the Ten-Year-Old Doctor – బ్రిటన్ మీకు నచ్చవచ్చు: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార ‘మహాశక్తి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే. పెద్దిపై శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు: జాన్వీ వివాదంపై ఎవరి తరఫు మాట్లాడిందో తెలుసా?         [InternationalEmmyAwards2026, 54thInternationalEmmyAwards, VirDas, RealKashmirFootballClub]
ఇరాన్‌లో హిజాబ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాట పాడిన గాయనికి, ఆమె బృందానికి కోర్టు విధించిన శిక్షను అమలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన గాయని పరస్తూ అహ్మదీ, ఆమెతో పాటు పనిచేసిన నలుగురు బృంద సభ్యులకు ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బలు వేసినట్లు వారి న్యాయవాది వెల్లడించిన సమాచారాన్ని స్థానిక మీడియా ప్రచురించింది. అంతేకాదు.. రెండేళ్ల పాటు సంగీత, కళా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, దేశం విడిచి వెళ్లకూడదని కూడా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ అంటే త‌ల‌, జ‌ట్టు, భుజాలు క‌వ‌ర్ చేస్తూ వేసుకునే ఒక వ‌స్త్రం. దీని ద్వారా ముఖం మాత్ర‌మే క‌నిపిస్తుంది.  ఈ వివాదానికి కారణం 2024 డిసెంబర్‌లో పరస్తూ అహ్మదీ చేసిన ఒక ఆన్‌లైన్‌ సంగీత ప్రదర్శన. ఆ వీడియోలో ఆమె హిజాబ్‌ ధరించకుండా, భుజాలు కనిపించే నల్లటి దుస్తుల్లో పాటలు పాడారు. ఆమెతో పాటు పురుష సంగీతకారులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌ ధరించాలనే నిబంధనలు ఉండటంతో.. ఈ ప్రదర్శనపై అక్కడి న్యాయవ్యవస్థ చర్యలు తీసుకుంది. గాయని, ఆమె బృందంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇది కూడా చదవండి: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! ఈ కేసులో పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురిపై ‘అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో రూపొందించి ప్రచురించడం’ అనే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కోర్టు వారికి 74 కొరడా దెబ్బల శిక్షతో పాటు రెండేళ్ల పాటు కళా, సంగీత కార్యకలాపాలపై నిషేధం, ప్రయాణ నిషేధం విధించినట్లు న్యాయవాది తెలిపిన వివరాలను ఇరాన్‌ మీడియా వెల్లడించింది. అయితే ఈ శిక్ష అమలుపై ఇరాన్‌ అధికారుల నుంచి వెంటనే అధికారిక స్పందన రాలేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్‌లో మహిళల హిజాబ్‌ నిబంధనలు గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. 2022లో మహ్సా అమీనీ అనే యువతి పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు అంతర్జాతీయంగా కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు పరస్తూ అహ్మదీకి, ఆమె బృందానికి విధించిన శిక్షపై పలువురు మానవ హక్కుల సంఘాలు, పాశ్చాత్య దేశాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కొరడా దెబ్బల శిక్షను హింసగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు:  అడివి శేష్ కొత్త మూవీ: ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే? డైరెక్టర్ ఎవరంటే? విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం: ఆనందంతో పొంగిపోతున్న తెలుగు ఫ్యాన్స్.!     [ParastooAhmadi, ParastooAhmadiNews, IranianSinger, ParastooAhmadi74Lashes]
శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీ ఉండటం ఎంత కామనో.. ఇతర హీరోల సినిమాలపై సెటైర్లు ఉండటం కూడా అంతే కామన్ అయిపోయింది. ఇటీవల ఈ డోస్ మరింత పెరిగింది.  శ్రీవిష్ణు లాస్ట్ మూవీ 'కామ్రేడ్ కళ్యాణ్'లో పలు సినిమాలపై సెటైర్లు వేశారు. వాటిలో 'ప్యారడైజ్, ఆచార్య' సినిమాలపై వేసిన సెటైర్లు బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా చనిపోయిన కాకిని చూపిస్తూ 'ప్యారడైజ్ కాకి' అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పై నాని ఫ్యాన్స్ అప్పుడే ఫైర్ అయ్యారు.  అలాగే అందులో ఆచార్య మూవీపై కూడా సెటైర్ ఉంది. ఒక సీన్లో 'నీదే దళం 'అని నక్సలైట్ నాయకుడు అడిగితే.. "ఆచార్య దళం. అది పాదఘట్టానికి, ధర్మస్థలికి మధ్యలో ఉంటుంది" అని శ్రీవిష్ణు అంటాడు. అయితే ఈ డైలాగ్ గురించి ముందే మెగాస్టార్ కి చెప్పామని శ్రీవిష్ణు చెప్పినప్పటికీ.. చాలామంది మెగా ఫ్యాన్స్ ఈ డైలాగ్ కి హర్ట్ అయ్యారు. ఇక తన నెక్స్ట్ మూవీ 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్‌లోనూ ఇతర హీరోల సినిమాలపై సెటైర్లు వేసి ఫ్యాన్స్ ను మరోసారి ట్రిగ్గర్ చేశాడు శ్రీవిష్ణు. ముఖ్యంగా ఈ టీజర్‌లో మళ్ళీ 'ప్యారడైజ్'ను టార్గెట్ చేశాడు. టీజర్ చివర్లో "గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలి" అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.  ఇది కూడా చదవండి: ఫ్యామిలీ ప్యాక్ టీజర్‌.. శ్రీ విష్ణు నాన్ స్టాప్ పంచ్‌లు.! 'ప్యారడైజ్'లో హీరో గుర్తింపు కోసం పోరాడతాడు. ఇలాంటి గుర్తింపు కథలను ఇక ఆపండి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు దానినే పట్టుకొని "గుర్తింపు కథలు వద్దురా" అంటూ శ్రీవిష్ణు సెటైర్ వేయడం నాని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. గతేడాది శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' సినిమాలో కూడా 'ప్యారడైజ్ కాకి' డైలాగ్ ఉంటుంది. 'ప్యారడైజ్' గ్లింప్స్ లోని డైలాగ్ ను రీక్రియెట్ చేస్తూ.. "నీలాంటి కాకుల గురించి ఎక్కడా రాయలేదురా" అంటాడు.  ఇలా ప్యారడైజ్ ను టార్గెట్ చేస్తూ శ్రీవిష్ణు పదే పదే డైలాగ్స్ పేల్చడంపై నాని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నవ్వించడం తప్పులేదు కానీ, ఇలా ఒక సినిమాని అదే పనిగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని విరుచుకుపడుతున్నారు. మరోవైపు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్‌లో మెగా ఫ్యాన్స్ ను కూడా హర్ట్ చేశాడు శ్రీవిష్ణు. "కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ రిపోర్టింగ్ సార్" అంటూ ఆవేశంగా డైలాగ్ చెబుతాడు. అయితే ఆ డైలాగ్ స్టాలిన్ సినిమాలో "మేజర్ స్టాలిన్ రిపోర్టింగ్ సార్" అనే డైలాగ్ ను గుర్తు చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ చూసి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీని అందరి హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలా పదే పదే ఇతర హీరోల సినిమాల మీద సెటైర్లు వేయడం వల్ల.. ఆయా హీరోల ఫ్యాన్స్ శ్రీవిష్ణు సినిమాలకు దూరమయ్యే ప్రమాదముంది. మరి ఈ విషయాన్ని గుర్తించి రాబోయే సినిమాల్లోనైనా ఇతర హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేయని కామెడీతో వస్తాడేమో చూడాలి. మీకు నచ్చవచ్చు: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.! బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.!       [Sree Vishnu Comedy, Family Pack Teaser, Nani Paradise, Chiranjeevi, Stalin Movie]  
Netflix has released a creative promo for Megaverse, hinting at the arrival of Megastar Chiranjeevi on the streaming platform. The promotional video cleverly highlights the missing letter ‘N’ from Chiranjeevi's name before revealing that the actor is coming to Netflix very soon. Chiranjeevi makes an appearance towards the end of the promo and declares, “Idi Naa Adda.” The dialogue has added to the curiosity surrounding the project, which is expected to be a new talk show featuring the Megastar. According to reports, Chiranjeevi's elder daughter Sushmita Konidela is producing the show for Netflix. The project is expected to bring together several prominent personalities from the Telugu film industry and beyond. Nagarjuna Akkineni, Brahmanandam, politicians and several popular actors are reportedly among the guests expected to appear on the show. The format and the conversations Chiranjeevi will have with these personalities are likely to be key attractions. Also Read: Chiru Leaks Strike Again!  The promo has already created anticipation, especially with Chiranjeevi's “Idi Naa Adda” dialogue suggesting that the show will carry his trademark charm and personality. Netflix is yet to reveal the complete details of the programme. With Chiranjeevi entering the talk-show space, Megaverse is expected to compete with Nandamuri Balakrishna's popular talk show Unstoppable. The arrival of another major Telugu star in this format could make the upcoming show an interesting addition to the OTT entertainment landscape. Check Out:   Overthinking might have hurt Brahmastra : Ayan Mukherji                        Shruti Haasan reacts to Peddi controversy   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఉన్న వైబ్రేషన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి తనదైన ఛరిష్మాతో సెల్యులాయిడ్, అభిమానులు, ప్రేక్షకులని తన సినీ కాంపౌండ్ వాల్ లో కట్టిపడేసాడు.   ఇప్పుడు ఆయన మెగావర్స్' టాక్ షో తో కొత్త అవతారం ఎత్తబోతున్నవిషయం తెలిసిందే.   ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది ఆయన పేరులోనే ఓ అక్షరం కనిపించకుండా పోతే? ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తున్న భారీ హోర్డింగ్స్‌ ఇదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ‘CHIRANJEEVI’ అని ఉండాల్సిన పేరును ‘CHIRA_JEEVI’ అంటూ మధ్యలో ‘N’ లేకుండా ముద్రించారు. దీంతో అసలు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఇది కొత్త మూవీ ప్రమోషన్ అనుకుంటున్నారు. అయితే ఈ హోర్డింగ్స్‌ వెనుక అసలు కారణం తెలుపుతూ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ మరో వీడియో రిలీజ్ చేసింది. అందులో N  అక్షరం లేదని చిరంజీవికి సంబంధించిన అభిమానులు తమ రోజు వారి పనులు చేస్తూనే ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత చిరు వచ్చి ఇది నా అడ్డా అనడంతో పాటు 'N ' అంటే నెట్ ఫ్లిక్స్ సింబల్ అని కూడా క్లారిఫై ఇచ్చారు. నిమిషం ఐదు సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమం కేవలం సెలబ్రిటీల ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా.. వారి జీవితాల్లోని ఆసక్తికరమైన సంఘటనలు, కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, సినీ ప్రయాణంలో జరిగిన మరచిపోలేని విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ముఖ్యంగా చిరంజీవికి సినీ పరిశ్రమలో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇది కూడా చదవండి:అడివి శేష్‌ కొత్త మూవీ: ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే?డైరెక్టర్ ఎవరంటే? ఇక ఈ షోలో పాల్గొనబోయే అతిథుల విషయంలోనే అసలు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి స్టార్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరితో పాటు బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి కమెడియన్లు కూడా సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అతిథుల జాబితా మొత్తానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ స్టార్ హీరోలంతా చిరంజీవితో ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు అంతకంటే పెద్ద పండగ ఏముంటుంది? ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఒకే టాక్ షోలో కనిపిస్తే సోషల్ మీడియాలో ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు సినిమాల్లో కాకుండా టాక్ షోలో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే వినోదం మరో స్థాయిలో ఉండటం ఖాయం.   వారి మధ్య జరిగే సరదా సంభాషణలు, పాత సినిమా జ్ఞాపకాలు, షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే అవకాశం ఉంది. అలాగే సునీల్, సత్యలతో చిరంజీవి చేసే ముచ్చట్లు కూడా షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. నవంబర్ 30న హైదరాబాద్‌లో మెగావర్స్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో షోకు సంబంధించిన మరిన్ని వివరాలు, అతిథుల జాబితా, స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన విజయ్ సేతుపతి: ఆ అరుదైన గౌరవం కరెక్ట్ నేనా! మీకు నచ్చవచ్చు:పెద్ది: జాన్వీ కపూర్ మ్యాటర్ ఇంకా అయిపోలేదా!     [Megaverse Talk Show, Chiranjeevi, Netflix, Mega Fans, Tollywood]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చల్లగాలి వణుకు పుట్టిస్తుంది, ఆ వెంటనే జలుబు, దగ్గు, నీరసం, మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చలి వాతావరణంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనం, స్థిరమైన శక్తి మరియు బలం అవసరమవుతాయి. అలాంటి కాలానికి మన సంప్రదాయ వంటకాలలో గోందు లడ్డూ ఒక అద్భుతమైన బలవర్ధక ఆహారంగా నిలుస్తుంది. ఇందులో ఉపయోగించే గోందు ప్రత్యేకమైన చెట్ల నుంచి లభించే సహజ జిగురు కాగా, ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చలవ కోసం వాడే గోందు కతీరాకు భిన్నంగా, సాధారణ గోందు శీతాకాలంలో శరీరానికి వేడిని, బలాన్ని అందించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ గోందు లడ్డూల తయారీలో ప్రతి కొలత, ప్రతి దశ కూడా రుచి మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ముందుగా 1 కప్పు గోధుమపిండిలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుతూ పిండి ముద్ద కాకుండా 15 నిమిషాలు నానబెట్టి, ఆపై జల్లెడ పడితే అది చక్కటి రవ్వలా మారుతుంది. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు గోందును తక్కువ మంటపై వేయించాలి; అది వడియాల్లా ఉబ్బి తెల్లగా మారేవరకు లోపలి వరకు వేయించడం చాలా అవసరం, లేదంటే తినేటప్పుడు పళ్లకు జిగురుగా అంటుకుంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యితో జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు, అలాగే అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరిని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమపిండి రవ్వను మరొక 1 స్పూన్ నెయ్యిలో లో ఫ్లేమ్ మీద రంగు మారి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. వేయించిన గోందును చేతితో మెత్తగా క్రష్ చేసి, దానికి అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి, గోధుమపిండి మిశ్రమాన్ని కలపాలి. మరోవైపు ముప్పావు కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంటపై తీగపాకం వచ్చేవరకు కరిగించి, ఆ పాకాన్ని మిశ్రమంలో వడకట్టి వేయాలి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కలిపి, తర్వాత చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టాలి. ఇలా తయారు చేసిన గోందు లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పోషకాల పరంగా చూస్తే, సుమారు 30 గ్రాముల నుంచి 35 గ్రాముల బరువున్న ఒక గోందు లడ్డూ దాదాపు 160 నుంచి 180 క్యాలరీల శక్తిని అందిస్తుంది (సైజు మరియు నెయ్యి, బెల్లం మోతాదును బట్టి 60 గ్రాముల లడ్డూలో 287 క్యాలరీల వరకు ఉండవచ్చు). గోధుమపిండి మరియు బెల్లం నుంచి కార్బోహైడ్రేట్లు, నెయ్యి మరియు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు లభిస్తాయి. చలికాలంలో రోజుకు కేవలం 1 గోందు లడ్డూ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఎముకలు మరియు కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఒక్క కివీ లేదా ఉడికించిన టమాటో: కణాల ఆరోగ్యంపై డాక్టర్ సూచనలు ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలకు నడుము మరియు ఎముకలు గట్టిపడటానికి, శరీరం త్వరగా కోలుకోవడానికి సంప్రదాయకంగా వీటిని తినిపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలోనూ ఇవి మంచి తోడ్పాటు అందిస్తాయి. అయితే ఇందులో నెయ్యి, బెల్లం, గోధుమపిండి ఉండటం వల్ల క్యాలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి; కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా బరువు నియంత్రణలో ఉన్నవారు మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మొత్తానికి, సరైన మోతాదులో తీసుకుంటే గోందు లడ్డూ శీతాకాలంలో రుచిని, ఆరోగ్యాన్ని కలబోసే విలువైన సంప్రదాయ ఆహారం. బయట దొరికే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూను రోజుకు 1 చొప్పున 10 రోజుల పాటు నిల్వ ఉండేలా సిద్ధం చేసుకుంటే చలికాలపు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సహజ పదార్థాల మేళవింపుతో రూపొందే ఈ లడ్డూ మన జీవనశైలిలో భాగమైతే శరీరానికి బలం, మనసుకు తృప్తి రెండూ దక్కుతాయి. మీకు నచ్చవచ్చు:పిల్లల స్నాక్ బాక్స్ కోసం, క్విక్ అటుకుల మిక్చర్.. నెల రోజులు నిల్వ                                  వేడి అన్నంలో నెయ్యి, చిక్కుడుకాయ కూర.. బాల్యపు రుచి మళ్లీ!       Winter Gond Laddu, Gond Laddu Benefits, Strong Bones In Winter, Immunity Boosting Laddu, Edible Gum Laddu, Winter Wellness Tips, Health Tips In Telugu.  
మునగాకు (Moringa Leaves) అంటే కేవలం ఒక ఆకు కూర మాత్రమే కాదు.. ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. మన రోజువారీ ఆహారంలో మునగాకును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మునగాకు పొడితో తయారుచేసే మునగాకు లడ్డూలు ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి ఉన్నవారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. మరి మునగాకు లడ్డూల ప్రత్యేకత ఏమిటి? వీటిని తినడం వల్ల ఎలాంటి పోషక ప్రయోజనాలు లభిస్తాయి? మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు మునగాకులో లభిస్తాయి. అందుకే మునగాకును పోషకాల గనిగా పిలుస్తారు. మునగాకును నేరుగా కూరగా తీసుకోవడమే కాకుండా, ఎండబెట్టి పొడిగా తయారుచేసి కూడా ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. మునగాకు పొడితో తయారుచేసే లడ్డూలు ఎలా ఉంటాయి? వీటిని తయారుచేయడానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు? మునగాకు పొడిని లడ్డూల రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమిటి? రోజువారీ ఆహారంలో మునగాకు పొడిని ఎలా చేర్చుకోవాలి? రోజుకు ఎన్ని మునగాకు లడ్డూలు తీసుకోవచ్చు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో Green Alchemy Founder అరుణ గారు మునగాకు పొడి తయారీ విధానం, దాని పోషకవిలువలు, మునగాకు లడ్డూల తయారీ ప్రత్యేకతలు, వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మునగాకు లడ్డూల్లో ఉపయోగించే పదార్థాలు, వాటి పోషక ప్రాధాన్యత, రోజూ రెండు లడ్డూలు తినడం వెనుక ఉన్న ఆలోచన వంటి విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మునగాకు, మునగాకు పొడి, మునగాకు లడ్డూల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి. గమనిక: మునగాకు పోషకాలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, మునగాకు లడ్డూలు తీసుకోవడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.  వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పోషకాహార విశేషాలు, సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాల కోసం తెలుగు వన్ హెల్త్ (TeluguOne Health)ను అనుసరించండి.
ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి. నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.! గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి.. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                                                                                *రూపశ్రీ. మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!                                 కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవిగా కనిపించినప్పటికీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids), డైటరీ ఫైబర్ (Dietary Fiber), ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు అవిసె గింజలు ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నవారికి అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించడంలో వీటికి ఉన్న పాత్ర ఏమిటి? వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి అవిసె గింజలు ఎలా తోడ్పడతాయి? వీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు ఎలా సహాయపడతాయి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. అయితే అవిసె గింజలను పచ్చిగా తినాలా? వేయించి తీసుకోవాలా? పొడి చేసుకుని తీసుకోవడం మంచిదా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అవిసె గింజలను తీసుకోవచ్చా? థైరాయిడ్ మందులు వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందరూ వీటిని తీసుకోవచ్చా? ఎవరు ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి? అనే సందేహాలకు కూడా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మగారు అవిసె గింజల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకునే సరైన పద్ధతి, తగిన మోతాదు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేశారు. మరి గుప్పెడు అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? కీళ్ల ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు వీటి ప్రయోజనాలు ఏమిటి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.