ధర్మాన, యర్రన్నలకు ముందు నుయ్యి వెనక గొయ్యి
Publish Date:Mar 14, 2012
Advertisement
శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి ధర్మాన ప్రసాదరావు, టిడిపి తరపున కింజరావు యర్రంనాయుడు తిరుగులేని నాయకులుగా చలామణి అవుతున్నారు. అయితే వీరిద్దరికీ నర్సన్నపేట ఉప ఎన్నికలు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా సంకటంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ ధర్మాన కృష్ణదాస్ పోటీచేస్తున్నారు. ఈయన రాష్ట్రమంత్రి ధర్మాన ప్రసాదరావుకు స్వయానా సోదరుడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసి, అతన్ని గెలిపించే బాధ్యత అధిష్టానం మంత్రి ధర్మానపైనే ఉంచింది. ఇది ధర్మానకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇప్పటికే ధర్మాన కుటుంబంలో చీలికలు వచ్చాయి. తన అన్నకు వ్యతిరేఖంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చురుకుగా వ్యవహరిస్తే కుటుంబంలో విబేధాలు మరింత పెరిగే అవకాశం వుంది. ఒకవేళ ఉప ఎన్నికల్లో ధర్మాన సూచించిన వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోతే జిల్లాలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ మంత్రిగారి ప్రతిష్ట మసకబారిపోతుంది. పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారితే ఆయన పదవే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.దీంతో ఆయన దిక్కుతోచక వ్యూహంతో ఎన్నికలో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఆయన టిడిపి నేత ఎర్రంనాయుడుతో లాలూచీ పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరీశీలకులు అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నిక కింజరాపు ఎర్రంనాయుడుకు కూడా పెద్ద సవాలుగా మారింది. కృష్ణదాస్ ను, కాంగ్రెస్ నిలబెట్టబోయే అభ్యర్థిని సమర్ధవంతంగా ఢీకొనాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కింజరాపు సోదరుల్లో ఒకరిని పోటీకి నిలపాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎర్రంనాయుడు గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయింది. ఉపఎన్నికల్లో పోటీచేసే ఓటమి పాలైతే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని ఎర్రంనాయుడు భయపడుతున్నాడు. అందుకే తన కుటుంబ సభ్యులను ఈ ఎన్నికలకు దూరంగా పెట్టడంతోపాటు కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ధర్మాన, కింజరాపు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేమీ కాదని, 1996 నుంచి వారిద్దరూ ఈ సూత్రాన్నే పాటిస్తే రాజకీయంగా ఎదిగారని వారి ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికల్లో నర్సన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి టిడిపి లోపాయికారీగా మద్దతునివ్వటం, టిడిపి ద్వితీయశ్రేణి నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టి నామమాత్రంగా పోటీలో ఉండటం, అందుకు ప్రతిగా విశాఖజిల్లా పాయకారావుపేట నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిడిపికి కాంగ్రెస్ సహకరించడం అన్న మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని ఈ ఇద్దరు నాయకులు అమలు చేయబోతున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/congress-party--dharmana-prasad-rao-24-12622.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





