కాంగ్రెస్ బీసీ మంత్రం

Publish Date:Jul 17, 2023

Advertisement

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించేందుకు అన్ని ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం త‌రువాత తెలంగాణ‌లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న విష‌యం తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి మండ‌ల‌, జిల్లా స్థాయిల్లో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు వంటి కీల‌క నేత‌లు కాంగ్రెస్‌లో చేర‌డం అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. వీరికి తోడు మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే బీఆర్ఎస్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టిసారించారు. తెలంగాణ‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ప‌లు సంద‌ర్భాల్లో రాహుల్ పేర్కొంటూ వ‌స్తున్నారు. రాహుల్ గాంధీ అంత ధీమాగా చెప్ప‌డానికి కార‌ణం స‌ర్వేల నివేదిక‌లేన‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌ర్వేలో కాంగ్రెస్ విజ‌యం ప‌క్కా అని తేలిదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి‌. తెలంగాణలోని పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు కాంగ్రెస్‌తోనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్నరని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 

2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య విబేధాలు కేసీఆర్‌కు క‌లిసొచ్చాయ‌నే చెప్పొచ్చు. ఈసారి ఆ అవ‌కాశాన్ని కేసీఆర్‌కు ఇవ్వ‌కుండా కాంగ్రెస్ నేత‌లంతా ఐక్య‌తా రాగాన్ని అందుకున్నారు. నేత‌లంతా ఒకేమాట‌పై ఉంటూ కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడిచేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాల‌ను తిప్పికొడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటుండ‌గా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు జోష్ పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే ఆ రెండు సామ‌జిక వ‌ర్గాల ఓట‌ర్లు ఎక్కువ‌గా కాంగ్రెస్ వెంటే ఉంటూ వ‌స్తున్నారు. మిగిలిన వారినిసైతం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికేలా కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నది. దీనికితోడు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ద‌ళితుడే తెలంగాణ సీఎం అవుతాడ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆ హామీని తుంగ‌లో తొక్కారు. మ‌రోవైపు ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అని చెప్పి కేసీఆర్ కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే ఇచ్చి ఆ ప‌థ‌కానికి ఎగ‌నాం పెట్టారు. ద‌ళిత బంధు విష‌యంలో దాదాపు అదే ప‌రిస్థితి. ఈ విష‌యాల‌పై ఎస్సీ ఓట‌ర్ల‌లో చైత‌న్యం నింపి వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకొనేలా కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్య‌లు చేప‌ట్టింది. 

మ‌రోవైపు.. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా   పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. దీంతో ఎస్టీ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ అదిష్టానం గ‌ట్టి ప్లానే వేసింది. దీనికి విరుగుడుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకుకూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని ఆ పార్టీ నేత‌లు హామీ ఇస్తున్నారు. ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కు తోడు బీసీ వ‌ర్గాల‌పైనా కాంగ్రెస్ గురిపెట్టింది. తెలంగాణ‌లో బీసీ   ఓట‌ర్లు అధికంగా ఉన్నారు. అనేక‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై వీరి ప్ర‌భావం ఎక్కువే. బీసీ ఓట‌ర్లు అధికంగా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే నియోజ‌క‌వ‌ర్గాలుకూడా ఉన్నాయి. దీంతో బీసీల‌పై కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపులో బీసీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు చెప్పారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గ‌ర్జ‌న స‌భ‌లు నిర్వ‌హించేందు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది. 

బీసీ గ‌ర్జ‌న స‌భ‌ల్లో భాగంగా తొలుత ప‌లు జిల్లాల్లో స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించింది. ఈనెల 19న సంగారెడ్డిలో, 21న క‌రీంన‌గ‌ర్, 23న నిజామాబాద్‌, 24 అదిలాబాద్ జిల్లాల్లో సన్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ ప్ర‌క‌టించారు. అయితే, ఈ స‌న్నాహ‌క స‌మావేశాల‌కు రాహుల్ గాంధీ, క‌ర్ణాట‌క సీఎం సిద్ధ రామ‌య్య‌ల‌ను ఆహ్వానిస్తామ‌ని చెప్పారు. ఈ స‌మావేశాల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బీసీ వ‌ర్గాల‌ను విస్మ‌రించింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, బీసీల అభివృద్ధికోసం అమ‌లు చేసే ప‌థ‌కాల‌ను సైతం ఈ స‌మావేశాల్లో వివ‌రించే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ ఓట్ల‌పై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా బీసీ వ‌ర్గాల ఓట్ల‌పైనా ఫోక‌స్ పెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు స‌క్సెస్ అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.