బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కాంగ్రెస్‌కు పెరిగిన క్రేజ్

Publish Date:Jul 17, 2023

Advertisement

తెలంగాణ‌లో మ‌రి కొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందుకు ఈసీ ఏర్పాట్లు మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు  కాంగ్రెస్‌, బీజేపీలు వాటి వాటి  వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో మ‌రోసారి అధికారం మాదే అని భావించిన బీఆర్ఎస్ నేత‌ల్లో ప్ర‌స్తుతం ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతున్నది.

క‌ర్ణాట‌క‌లో  విజ‌యం త‌రువాత తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్ద‌లు సైతం తెలంగాణపై ప్ర‌త్యేక దృష్టిసారించ‌డంతో బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. గ‌తంలోలా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య చీలిక తెచ్చి పార్టీ బ‌లాన్ని నిర్వీర్యం చేయాల‌నుకున్న సీఎం కేసీఆర్ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. కాంగ్రెస్ పార్టీలోని అగ్ర‌నేత‌లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు. కేసీఆర్‌ను గ‌ద్దెదించ‌డ‌మే ల‌క్ష్యం అంటూ నేత‌లు గంటాప‌థంగా చెబుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీనేత‌ల ఐక‌మ‌త్యంగా అధికార పార్టీపై పోరాడుతుండ‌టంతో గ్రామ‌ స్థాయి నుంచి పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా అనిపించేలా వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్లో బ‌ద‌నాం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. ఈ క్ర‌మంలో అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ అధిష్టానం త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే  అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టింది.   రేవంత్ రెడ్డి రైతుల‌కు కేవ‌లం మూడు గంట‌ల పాటే ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని చెప్పారని, రైతులంటే కాంగ్రెస్‌కు గిట్ట‌ద‌ని అర్థ‌మైంద‌ని, రైతులంతా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను నిల‌దీయాలంటూ బీఆర్ఎస్ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్టిమ‌రీ చెప్పారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా స‌బ్ స్టేష‌న్ల వ‌ద్ద బీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న‌కు సైతం దిగారు. అయితే  బీఆర్ఎస్ వ్యూహాన్ని కాంగ్రెస్   నేత‌లు తిప్పికొట్టారు. రేవంత్ వ్యాఖ్యల‌ను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ రైతుల మెప్పు పొందాల‌ని చూస్తున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన రేవంత్ సైతం బీఆర్ఎస్ నేత‌లపై ఆగ్ర‌హం వ్య‌క్త చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిస్థాయిలో కాకుండా బీఆర్ఎస్ అధిష్టానం వారికి అనుకూలంగా కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో వీడియో విడుద‌ల చేసింద‌ని రేవంత్ ఆగ్రహం వ్య‌క్తం చేశాడు.

అమెరికాలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను రేవంత్ మీడియా ముందు మ‌రోసారి వెల్ల‌డించారు. 24గంట‌ల విద్యుత్ పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయ‌లు దోపిడీ చేస్తున్నారని రేవంత్ చెప్పారు. 24గంట‌ల ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి 16వేల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్‌.. కేవ‌లం ఎనిమిది గంట‌లు మాత్ర‌మే ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఈ మాత్రం విద్యుత్ ఇవ్వ‌టానికి కేవ‌లం 8వేల కోట్లు మాత్ర‌మే స‌రిపోతాయ‌ని రేవంత్ చెప్పారు. కానీ, ఉచిత విద్యుత్ పేరుతో కోట్లాది రూపాయ‌లు కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. దీనికితోడు బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తుండ‌టంతో బీఆర్ఎస్ బ‌డా నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. బీఆర్ఎస్ లేవ‌నెత్తిన ఉచిత‌ విద్యుత్ అంశం ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీకే క్రేజ్ పెంచింద‌ని అధికార పార్టీ నేత‌లు వాపోతున్నార‌ని పరిశీలకులు చెబుతున్నారు‌. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం త‌న పంతాన్ని నెగ్గించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉంది. కాంగ్రెస్ నేత‌లు సైతం బీఆర్ఎస్ వ్యూహాల‌ను తిప్పికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

ఉచిత విద్యుత్ అంశంపై అమెరికాలో రేవంత్ వ్యాఖ్య‌ల‌పై అధికార పార్టీ నేత‌లు నిర‌స‌న‌లు తెలిపినా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా స్పందన క‌నింపించ‌లేద‌ని బీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించడంతో ఆ ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తూనే మ‌రో అంశాన్ని లేవ‌నెత్తింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హ‌యాంలో తొమ్మిది గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఇప్పుడున్న కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ అని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్‌ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్‌, హ‌రీష్ రావులు రేవంత్ రెడ్డి చోటా చంద్ర‌బాబు అంటూ విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. అయితే, బీఆర్ఎస్ కొత్త‌గా లేవ‌నెత్తిన అంశంపైనా కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో ఉన్న స‌గం మంది మంత్రులు టీడీపీ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని.  పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా?  తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? అంటూ కాంగ్రెస్ నేత‌లు ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష అని, కేసీఆర్‌ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టిందంటూ కాంగ్రెస్ నేత‌లు కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై ఎటాక్ మొద‌లు పెట్టారు. మొత్తానికి బీఆర్ఎస్ ఏ అంశాన్ని లేవ‌నెత్తినా కాంగ్రెస్ నేత‌లు ఐక్యంగా  కౌంట‌ర్ ఇస్తుండ‌టంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఇదే రీతిలో కాంగ్రెస్ నేత‌లు ముందుకు సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టం ప‌క్కా అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.