ఎవరిగోల వారిదే

Publish Date:Dec 2, 2013

Advertisement

 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదేలా తయారయిందిప్పుడు. కాంగ్రెస్ అధిష్టానం ఆఖరి నిమిషంలో మళ్ళీ మాట మార్చి రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెస్తుంటే, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు మాత్రం “ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఇస్తున్న సోనియమ్మ మాపాలిట పోచమ్మ ” అంటూ మరో జైత్రయాత్రకు యాదగిరి గుట్టలో జెండా ఊపి సాగనంపి వచ్చారు.

 

రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి ఊడిపోవడంతో ఆమె తన ఖమ్మం జిల్లా నేతలకి కూడా లోకువయిపోయారు. అందుకే ఆమె హడావుడిగా తన అనుచరులను వెంటేసుకొని పది కార్లలో భద్రాచలంపైకి దండ యాత్రకి వెళ్లి, “భద్రాచలం గురించి ఎవరయినా మాట్లాడితే కబడ్దార్!” అని బలప్రదర్శన చేసిన తరువాత, రాముడి గుడికి వెళ్లకపోయినా మీడియా ముందు కాసేపు సోనియమ్మ భజన చేసారు.

 

ఇక మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచవలసి ఉందో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. జైపాల్ రెడ్డి తను తెర వెనుక చేసిన మంత్రాంగంతోనే తెలంగాణా ఏర్పడుతోందని మధ్యమధ్యలో అందరికీ గుర్తు చేస్తుంటారు. ఇక జానారెడ్డిని సైడ్ చేసేసి హటాత్తుగా ముందుకు దూసుకుపోయిన దామోదర రాజనరసింహుల వారు డిల్లీకి మంత్లీ ప్లేన్ పాస్ తీసేసుకొని డిల్లీ-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. కానీ మొన్నఅధిష్టానం ‘రాయల తెలంగాణా’ అన్నపటి నుండి ఆయన మోహంలో కళ తప్పింది.

 

నిత్యం మీడియా ముందు హడావుడి చేసే జానారెడ్డి, ముఖ్యమంత్రి అవడానికి మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నందున ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదని సమాచారం. ఆయన కనబడకపోయేసరికి ఆయన స్థానంలోకి డీ.శ్రీనివాస్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ, రాయల తెలంగాణా ప్రతిపాదనను ఖండిస్తూ కొంచెం హడావుడి చేస్తున్నారు.

 

ఎన్నడూ హైదరాబాద్ దాటి తెలంగాణాలో కూడ కాలు పెట్టని దానం నాగేందర్ హైదరాబాద్ ని యూటీ చేస్తే అంగీకరించమని ప్రకటిస్తారు. అదేవిధంగా ‘హైదరాబాదు-యూటీ’ అనే అంశంపై స్పెషలిస్ట్ అయిన చిరంజీవి అదే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారమని సోనియమ్మ చెవిలో చెప్పి వస్తుంటారు.

 

కోట్ల వారికి రాయల తెలంగాణా కావాలి. బొత్సవారు గంట, జేసీ బ్రదర్స్,లగడపాటి తదితరులతో క్రమశిక్షణ చర్యల గురించి వాదోపవాదాలతో తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యమంత్రికి సమైక్యవాదంపై ఉపన్యాసాలు తయారు చేసుకొంటూ ఉండటంతో బొత్తిగా ఖాళీ లేదు.

 

అందువల్ల ఉల్లిపాయలు, టొమేటోల ధరలు పెరిగిపోయాయని, తుఫానులో పొలాలు నష్టపోయాయని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, బస్సుల్లోమనుషులు కాలిపోతున్నారని  ఎవరూ ఆందోళన చెందవద్దని మనవి. ఎన్నికలయ్యే వరకు  ప్రజలు కాస్త ఓపిక పట్టాల్సిందే. తప్పదు మరి. అన్యదా భావించవద్దని మనవి.

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.