విభజన చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ గట్టెక్కగలదా?

Publish Date:Feb 17, 2014

Advertisement

 

కోట్లాది తెలుగు ప్రజల భవిష్యత్తుపై చిరకాలం పాటు తీవ్ర ప్రభావం చూపబోయే రాష్ట్ర విభజన బిల్లుపై ఈరోజు లోక్ సభలో కేవలం నాలుగు గంటల్లో చర్చ ముగించి ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్నపాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడా తెలుగువాడి ప్రమేయం లేకుండా సాగుతున్న ఈ తంతులో చివరి రోజున కూడా సభలో తెలుగువాడు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందే జాగ్రత్తపడింది. ఉన్న కొద్ది మందిలో కొందరిని సోనియా గాంధీ తన కనుసైగతో అదుపు చేస్తుంటే మిగిలిన నలుగురైదుగురు ఆవేదన సభలో అరణ్యరోధనగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం తను ఇంత దిగజారిపోయినందుకు ఏ మాత్రం సిగ్గుపడకపోగా సభని, సీమాంధ్ర సభ్యులని ఇంత గొప్పగా మేనేజ్ చేయగలుగుతునందుకు గర్వపడుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతున్నా ఏనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ, మిగిలిన సీమాంధ్ర మంత్రులను కూడా మేనేజ్ చేసేందుకు నిన్న వారితో సమావేశమవడం చూస్తే, కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకొనేందుకు ఎంతకయినా దిగజారగలదని అర్ధమవుతుంది.

 

ఇక కేంద్రంలో ఈవిధంగా చక్రం తిప్పుతూనే, రాష్ట్రంలో ఆఖరి అధ్యాయం పూర్తి చేసేందుకు తన కనుసన్నలలో నడుచుకొనే బొత్ససత్యనారాయణను రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తన పదవికి రాజీనామా చేసి తప్పుకోబోతుండటంతో, ఆ స్థానంలో తను సర్దుకోవాలనే తాపత్రయపడుతున్న బొత్స, కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలురయిన శాసనసభ్యులను, మంత్రులందరినీ పోగేసి, ఒకవైపు ముఖ్యమంత్రి వర్గాన్ని నిందిస్తూ, మరోవైపు తన సారధ్యంలో సమైక్యపోరాటం చేసేందుకు కలిసిరమ్మని ప్రతిపక్షాలకి లేఖలు కూడా వ్రాసారు. ఈరోజు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందబోతుంటే, అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవాలని తపిస్తున్న బొత్స వర్గం దేనికోసం డిల్లీ వెళ్ళాలనుకొంటున్నారో, దేనికోసం పోరాడుతారో తేలికగానే ఊహించుకోవచ్చును.

 

ఇక ముందే చెప్పుకొన్నట్లుగా రేపటి నుండి కిరణ్ కాంగ్రెస్, బొత్స కాంగ్రెస్, వై.కాంగ్రెస్ మూడు ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటూ సీమాంధ్ర ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు గట్టిగా కృషి చేస్తాయి. గత ఎన్నికలలో లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీని అడ్డుకోగా, ఈసారి కాంగ్రెస్ పార్టీయే మూడు పార్టీలుగా చీలి అడ్డుకోబోతోంది గనుక ఈమూడు పార్టీల మధ్య ప్రజల ఓట్లు చీలడం ఖాయం. (ఇవికాక మందకృష్ణ, బైరెడ్డి, ఆమాద్మీ పార్టీ, లోక్ సత్తాలు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి)  కాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు తగిన వ్యూహాలు తమ వద్ద సిద్దంగా ఉన్నాయని ఆరునెలల క్రితమే పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యూహం ఇదేనని క్రమంగా తేటతెల్లమవుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకుకాంగ్రెస్పార్టీ రాష్ట్రాన్నే కాదు తన స్వంత పార్టీని కూడా విభజించుకోగలదని రుజువు చేసుకొంది.

 

తెలంగాణా ఏర్పడుతున్నందుకు తెలంగాణా ప్రజలు సంతోషపడుతుంటే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీమాంధ్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు. అదిసరిపోదన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టబోతున్న ఈ వికృత పైశాచిక రాజకీయ క్రీడలో బలవంతంగా పాలుపంచుకోవలసిరావడం మరో దురదృష్టం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.