తెలుగువారికి కీలక పదవులు ఇవ్వరా?
Publish Date:Jul 26, 2012
Advertisement
మన రాష్ట్రం 33 మంది ఎంపీలను పంపి యపిఎ గవర్నమెంటును నిలపటంతో ప్రముఖ పాత్ర పోషించింది. కాని మంత్రుల విషయంలో మాత్రం వచ్చింది చాలా తక్కువ. తమళనాడు, వెస్ట్ బెంగాల్, యుపి, మహరాష్ట్ర ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా వాళ్లంతా మన కంటె చాలా తక్కువ ఎంపిలనిచ్చి కీలకమైన పదవులు సంపాదించుకున్నారని తెలుస్తుంది.. ఇంతమంది ఎంపీలను పంపిన మన రాష్ట్రానికి మాత్రం ఉన్నది ఒకే ఒక క్యాబినెట్ మంత్రి మంత్రి, మరో ఐదుగురు సహాయ మంత్రులతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతి సారీ క్యాబినెట్ విస్తరణ విన్నప్పుడు మన రాష్ట్రనాయకులంతా ఢల్లీలో చెక్కర్లు కొట్టటం మామూలైపోయింది.ప్రస్తుతం మన రాష్ట్రంనుండి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రులంతా రెడ్డి, కాపు, కమ్మ, ఎస్.సి, ఎస్‌టి కి సంబందితులు. కాబట్టి ప్రత్యర్ధివర్గమైన తెలుగుదేశం రాబోయేరోజుల్లో బిసిలకు వంద సీట్లు కెటాయింపు జరుగుతుందని ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్‌లోకూడా బిసిలకు ప్రాతినిద్యానికి గాను ఒక మంత్రి పదవి ఇవ్వడం అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తుంది. కాపు వర్గానికి చెందిన చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని తేలింది . అయితే సీనియర్ తెలంగాణ నాయకుడు విహనుమంత్‌రావుకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని టి.కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. హనుమంతరావు అయితేనే రాష్ట్రంలో వైసిపి నాయకుడు జగన్‌ని కూడా సమర్ధవంతంగా ఎదుర్కో గలరని వారు అనుకుంటున్నారు.
అయితే ఇప్పటికే డిల్లీలో మాజీ పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్, తెలంగాణాకే చెందిన మరి కొంత మంది నాయకులు ఉన్నారు. అంతే కాకుండా సీమాంద్రకు చెందిన కావూరి, రాయపాటికూడా డిల్లీలోనే పైరవీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కేంద్రాన్ని డిమాండ్ చేసి పదవులు తెచ్చుకోగలిగిన నేతలు లేనందువల్లే తెలుగువారికి డిల్లీలో సముచిత స్ధానం లభించడంలేదనేది అందరి అభిప్రాయం.
http://www.teluguone.com/news/content/congress-24-15984.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





