కాంగ్రెస్, వై.కాంగ్రెస్ రాజధాని భూసేకరణ వ్యతిరేఖ కమిటీలు

Publish Date:Nov 6, 2014

Advertisement

 

రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు కమిటీలు వేసింది. విజయవాడలో రాజధాని నిర్మాణాన్ని స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు ఇప్పుడు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకొంటోందని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడేందుకు చెరో కమిటీ ఏర్పాటు చేసుకొన్నాయి. ఇంతవరకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే చూసిన ప్రజలకి ఇప్పుడు అధికార కమిటీ, ప్రతిపక్ష కమిటీలను కూడా చూసే భాగ్యం కలుగుతోంది. అధికార కమిటీ రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి రాజధాని నిర్మాణం కోసం వారి భూములు తీసుకొనేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష కమిటీలు అధికార పార్టీ ప్రయత్నాలను విఫలం చేయడానికి కృషి చేస్తాయి.

 

అధికార పార్టీ నేతలు రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు కనుకనే తాము రైతుల తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడవలసి వస్తోందని చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం తూళ్ళూరు మండలం కేంద్రంగా రాజధాని నిర్మాణం తలబెట్టినట్లు తెలియగానే ఆ మండలంలో ఇంతవరకు మూడు గ్రామ సభలు జరిగినట్లు సమాచారం. అందులో కొన్ని గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో రైతులు ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటికీ ఒప్పుకొన్నట్లయితే తాము సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసారు. వారు మరో సంగతి కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై గ్రామాలలో అప్పుడే రాజకీయాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. బహుశః అది ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రయత్నాలను ఉద్దేశించి అన్నమాటలే అయ్యి ఉండవచ్చును.

 

ప్రభుత్వం రైతుల దగ్గర నుండి దౌర్జన్యంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేస్తే, దాని వలన తనకే కొత్త సమస్యలు, అప్రతిష్ట తప్పదని ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రాజధానిని వేరొక చోటికి తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. అటువంటప్పుడు అధికార పార్టీ రైతులపై ఎందుకు దౌర్జన్యం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కమిటీలు వేసుకొన్నాయంటే, సున్నితమయిన ఈ అంశం నుండి కూడా రాజకీయ మైలేజి పొందాలనే తాపత్రయమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ప్రభుత్వం తమ షరతులు, డిమాండ్లకు అంగీకరిస్తే తాము భూములు అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామని అనేక గ్రామాలలో రైతులు స్వయంగా చెపుతున్నప్పుడు, వైకాపా మాత్రం చాలా హడావుడిగా ఒక కమిటీ వేసేసుకోవడం విశేషం.

 

రైతులు తమ జీవనాధారమయిన భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటే నిశబ్దంగా ఉంటారని ఎవరూ అనుకోనవసరం లేదు. వారు తమకు అన్యాయం జరిగిందని నిరసన కార్యక్రమాలు మొదలుపెడితే కాంగ్రెస్, వైకాపాలు వెళ్లి వారికి అండగా నిలబడితే అందరూ హర్శిస్తారు. కానీ వారికి లేనిపోనివి చెప్పి భయాందోళనలకు గురిచేసి, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉసిగొల్పాలనుకొంటే దానివలన చివరికి వారే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అయినా ప్రతీ అంశంపై రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ప్రజల చేతిలో భంగపడక తప్పదని వారు గ్రహించాలి.వారు గ్రహించాల్సిన ముఖ్యమయిన విషయం మరొకటి కూడా ఉంది. ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడ్డంపడుతుండటం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారనే సంగతి గుర్తుంచుకోవడం మంచిది. 

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.