ఈ మూడు లక్షణాలు బలంగా ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే.. విజయం సాధించలేడట..!

Publish Date:Jan 27, 2026

Advertisement

ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం కోసం తహతహలాడుతూ ఉంటాడు.  విజయం సాధిస్తే తన జీవితం సంతోషంగా ఉన్నట్టు లెక్క అనుకుంటాడు. ఎంత బలవంతుడు అయినా సరే.. మూడు లక్షణాలు చాలా బలంగా ఉంటే అది మనిషిని విజయానికి దూరం చేస్తుందని అంటున్నారు.  ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? అవి మనిషిని ఎందుకు విజయానికి దూరం చేస్తాయి? తెలుసుకుంటే..

అనుబంధం..

మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో అనుబంధం కలిగి ఉంటడం చాలా మంచిదే. ఇది వ్యక్తుల మధ్య  బంధాన్ని బలంగా మారుస్తుంది.  కానీ మితిమీరిన అనుబంధం పెంచుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా మిగిలిన అన్ని విషయాల నుండి దృష్టి మరల్చుతాడు. దీని వల్ల ఆ వ్యక్తిలో ఎంత ప్రతిభ ఉన్నా,  ఎంత తెలివైన వారు అయినా.. విజయం సాధించలేరు.  

ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు.  కాబట్టి ఎవరితో అయినా అనుబంధం ముఖ్యమే కానీ అది  మితిమీరితే కొన్ని సార్లు వ్యసనంగా మారుతుంది. ఇదే మనుషులను విజయానికి దూరం చేస్తుంది.

అహంకారం..

అహంకారం ఉన్న మనిషి అధముడు అని అంటారు పెద్దలు. మనిషి అహంకారమే ఆ మనిషి వినాశనానికి దారి తీస్తుంది. ఎంత తెలివైన వ్యక్తి అయినా,  ఎంత ధనవంతుడు అయినా అహంకారం ఉంటే విజయం సాధించలేడు.

అహంకారం ఉన్న వ్యక్తి ఏ బంధాలను కొనసాగించలేడు.  అలాగే తన తప్పులను తెలుసుకోలేడు.  తన తప్పులను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి ఎప్పుడూ తప్పు మార్గంలోనే ప్రయాణిస్తాడు. అలాంటి వ్యక్తికి విజయం చాలా దూరంలో ఉంటుంది.  

సోమరితనం..

సోమరితనం విజయానికి పెద్ద అడ్డంకి. సోమరితనం ఉన్నవారు పనిని వాయిదా వేస్తూ ఉంటారు. కష్టపడి పని చేయడానికి సిద్దంగా ఉండరు.

కష్టపడి పని చేయడం,  క్రమశిక్షణతో ఉండటం వల్ల మాత్రమే విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ లక్షణాలు లేని వారు విజయం సరిహద్దును  కూడా తాకలేరు.

                    *రూపశ్రీ

By
en-us Political News

  
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.