సస్రీకాల్ జీ .. అంటున్న కెనడా సారా!
Publish Date:Sep 1, 2022
Advertisement
కాస్తంత నలుపు, రాగి కలయిక రంగులో జుత్తు, మెరిసే కళ్లు.. దాదాపు ఆరడుగుల అమ్మాయి అమాంతం ఊళ్లోకి దిగింది. ఆటోవాళ్లంతా వెంటబడ్డారు.. ఫలానా ప్రాంతానికి వెళ్లాలన్నది. ప్రాంతం పేరు చెప్పింది గనుక, ఈమెకు భాష రాదు గనుక మనవాళ్లు రెచ్చిపోయి వందల్లో మీటరు రేటు చెప్పారు. మొత్తానికి ఎంతో కొంత తగ్గి బయల్దేరారు. డ్రైవర్‌తో పాటు అతని స్నేహితుడు గైడ్ అవతారమెత్తాడు. ఆమెను కేవ లం కెనడా నుంచి వచ్చిన అమ్మాయిగానే అనుకున్నారు. బావా, దీన్ని నాలుగు ఏరియాలు తిప్పితే బాగా డబ్బు గుంజుకోవచ్చు గదా అని సదరు గైడ్ ఐడియా ఇచ్చాడు. డ్రైవర్ అలా కాదు ఆమె ఫోన్ నెంబర్ పట్టి ఉన్నన్ని రోజులూ ఆమెకు సేవ చేసుకుందాం.. అప్పుడు వేలల్లో లాగించేయచ్చని పెద్ద ఐడియా ఇచ్చా డు. అలా ఎన్నో ఐడియాలతో ఆ అమ్మాయిని నిజంగానే రెండు మూడు ఏరియాలు తిప్పి మొత్తానికి కెనడా పిల్ల వెళ్లాల్సిన చోటికి తెచ్చారు. ఆమె రూ.300 ఇచ్చింది. వీళ్లు ఆమె మొబైల్ నెంబర్ అడిగారు. ఇక్కడున్నన్నాళ్లూ సదా సేవలో ఉంటామని. ఆమె అంతే సరదాగా హిందీలో ..హమారా అసిస్టెంట్ యహా రహతా..ఆప్ జాయియే!.. అన్నది. అంతే మన హీరోలు నోరెళ్లబెట్టి రివ్వున వెళిపోయారు. మన భాష ఏదయినా ఇతరులకు పెద్దగా రాదన్నదే పొరపాటు. ఈరోజుల్లో విదేశాల్లో చాలామంది మన భాషల మీద మనకంటే ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఎక్కడన్నా హోటల్లోనో, రోడ్లమీదో విదేశీయులు కనపడగానే వాళ్లకేమీ తెల్వదని రెచ్చిపోతే అవమానం ఎదుర్కొనవలసి వస్తుంది. తల దించుకోవాల్సి వస్తుంది. అందరికీ అన్నీ తెలుస్తాయి. విదేశీయులు తమ అవసరాలకు కొన్ని తప్పకుండా నేర్చుకుం టారు. అందులోనూ ప్రయాణాలకు సంబంధించిన పదజాలం తప్పకుండా నేరుస్తారు. ముఖ్యంగా మన దేశానికి, మన నగరాలకు వచ్చేవారు మరీ జాగ్రత్తగానూ ఉంటారు. అసలే మనవాళ్లకి ఎర్రటి వాళ్లంటే మరీ చులకన. చిన్నపర్సుల్లో కోట్లు ఉంటాయన్న భ్రమ. వాళ్లు పనిగట్టుకుని నేర్చుకుంటున్నారు. వాళ్ల పిల్లలకీ నేర్పుతున్నారు. చాలారోజుల క్రితం టొరాంటోకి చెందిన పాప్ రచయిత, గాయని సారా విక్కెట్ ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనూ నిజానికి టొరాంటో వాడే. వాళ్లిద్దరూ నెట్ ద్వారా దగ్గరయ్యారు. ఆమెకు అతను ఏకంగా పంజాబీ నేర్పించాడు. ముందు ముందు ఎంతో అవసరం ఉంటుందన్న ఆలోచ నతో. సారా అతనితో ఎక్కువగా ఇంగ్లీషులో మధ్య మధ్యలో పంజాబీలోనూ మాట్లాడుతూంటుంది. కొత్త భాష నేర్చుకోవాలనుకునే విదేశీలయుల్లో చాలామంది భారతీయ భాషలపట్ల ఎంతో మక్కువ ప్రదర్శిస్తా రని ఆమే అన్నది. ఆమె విదేశీ స్నేహితులు, తోటి విద్యార్ధులు, ఉద్యోగులు చాలామంది భారతీయ భాషల్లో చాలా భాషలు.. తమకు ఇష్టం వచ్చిన భాష నేర్చేసుకున్నారట. వీలయితే ఎక్కువ ఆ భాషలోనే మాట్లాడు తున్నారట! అన్నట్టు సారా ఈ మధ్యనే ఓ పది నిమిషాలు పంజాబీలో మాట్లాడిన వీడియో ఢిల్లీలో ఇతర స్నేహితు లకూ పంపింది. తడబడినా.. బాగానే నేర్చుకుంటున్నావ్ సారా.. అంటూ వీరూ ఆమెను అభినం దించారు. మరంచేత.. విదేశీయులు మన నగరానికి వస్తే వారికేమీ రాదని అనుకోవద్దు!
http://www.teluguone.com/news/content/cnadian-girl-learned--pubjabi-25-143031.html





