ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారు : సీఎం రేవంత్ రెడ్డి
Publish Date:Aug 15, 2025
Advertisement
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు. వాళ్ళు సృష్టించే అపోహలు మీరు వేగంగా వ్యాపింపజేస్తే మన రాష్ట్రానికి, దేశానికి నష్టం కలిగిస్తాయిని తెలిపారు. క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఆయన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.భూమి అనేది సెంటిమెంట్, దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిది. అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని క్రెడాయ్ ద్వారా వాటన్నింటిని పటాపంచలు చేస్తామని రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అని... ఈ బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళతామని అన్నారు. ప్రపంచ సుందరీమణుల పోటీలను హైదరాబాద్ లో నిర్వహించామని... ఈ సందర్భంగా పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ప్రత్యేకతలు చూపించామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించారని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఈరోజు తెలంగాణ సాగునీటి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు అందరికీ నచ్చకపోవచ్చు కానీ హైటెక్ సిటీ కట్టింది ఆయనే అన్నారు.అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ముఖ్యమంత్రి అన్నారు
http://www.teluguone.com/news/content/cmrevanth-reddy-39-204296.html





