అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Publish Date:Mar 4, 2026

Advertisement

 

తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేతలు టచ్‌లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా పార్టీకి దీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గణపతి తరఫున తెలంగాణ పోలీసు లకు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. భద్రతా సంస్థలతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, సురక్షిత లొంగుబాటు కోసం నిబంధనలు, హామీలపై చర్చలు సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయ లేదు. ఇటీవల మావోయిస్టు నేత దేవ్‌జీ లొంగిపోయిన సందర్భంలో గణపతి ఆచూ కీపై కీలక సమాచారం లభిం చిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దేవ్‌జీ సమర్పణ తర్వాత మావో యిస్టు అగ్రనేతల కదలికల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గణపతి ఆరోగ్య పరిస్థితి, వయసు, అలాగే మావోయిస్టు కార్యకలాపాల బలహీనత నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి. 

కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం.గణపతి లొంగుబాటు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువ డితేనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు నిజమైతే, తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఇది కీలక మలుపు కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి  అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి , ఐజీ సుమతి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియ వేగవంతం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవూజీ తో సహా పలువురు కీలక నేతల లొంగుబాట్లపై చర్చించినట్లు సమాచారం. లొంగుబాటు తర్వాత వారికి కల్పించాల్సిన భద్రత, పునరావాసం, కేసుల పరిశీలన తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రితో వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

దేవూజీతో జరిగిన సమావేశంలో మావోయిస్టులు ఉంచిన డిమాండ్లు, శాంతి చర్చలకు సంబంధించిన ప్రతిపాదనలు, అభివృద్ధి హామీలు వంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ నెల మార్చి 31వ తేదీన నిర్వ హించనున్న “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్‌కు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. 

దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న చర్యలు, రాష్ట్రాల సమన్వయం,కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక సహకా రం వంటి అంశాలపై సమ గ్రంగా సమీక్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి, భద్రత, అభివృద్ధి అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రంతో కలిసి సమగ్ర వ్యూహంతో మావోయిస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.