Publish Date:Jun 29, 2026
తెలంగాణ రాజకీయాల్లోనూ, వ్యవసాయ రంగంలోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధిర పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మంగళవారం (జూన్ 30) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ.. భారీ వర్షాల కారణంగా రద్దైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. అయితే.. మధిరలో సభ రద్దైన ప్పటికీ, రైతాంగానికి అందించాల్సిన లబ్ధిని, భరోసాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయ కూడదన్న కృత నిశ్చయంతో.. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ బృహత్తర కార్యక్ర మాన్ని నిలిపివే యకుండా.. ప్రత్యామ్నాయంగా, మధిరలో జరగాల్సిన ఈ వేడుకను తక్షణమే హైదరాబాద్ శిల్పకళా వేదికకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వాతావరణం అనుకూలించకపోయినా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతుల వద్దకే నేరుగా వెళ్లాలని ప్రభుత్వం నిశ్చయించింది. శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ఈ సభ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సభను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. రైతు భరోసా పంపిణీ సదస్సు గా నామకరణం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డిజిటల్ విప్లవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఈ వేడుకలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భౌతికంగా మధిరలో సభ సాధ్యం కాకపోయినా, అధునాతన డిజిటల్ , వర్చువల్ పద్ధతుల ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులను ఏకతాటిపైకి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రైతు వేదికల' నుంచి రైతులు నేరుగా ఈ శిల్పకళా వేదిక సదస్సును వీక్షించేలా ప్రత్యేక లైవ్ స్క్రీన్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆడియో-విజువల్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-meeting-in-madhira-cancelled-36-224504.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.