మార్చి 6 నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్ : సీఎం రేవంత్‌రెడ్డి
Publish Date:Mar 3, 2026
Advertisement
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 10 రకాల థీమ్స్‌తో 5 స్థాయిలలో ఈ యాక్షన్ ప్లాన్ సాగనుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమలు జరపాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక సమావేశాన్ని నిర్ణయించారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు ముఖ్యమంత్రి తెలిపారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని తెలిపారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావుని తెలిపారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సీఎం తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలు… ముఖ్యమంత్రి వరకు ఇటు ప్రజా ప్రతినిధుల వ్యవస్థ, అటు కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలి’’ అని సీఎం అన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-214950.html





