దేశవ్యాప్తంగా సెన్సేషన్ ఆపరేషన్ చేస్తున్న తెలంగాణ సీఐడీ

Publish Date:Sep 24, 2025

Advertisement

 

తెలంగాణ సీఐడి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసు కున్న తెలంగాణ సిఐడి విచారణ చేస్తున్నారు.. మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు .

ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి విచారణ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడి లక్షల్లో డబ్బులు కోల్పోయి... చివరకు  ఆత్మ హత్య లకు  పాల్పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించా లని నిర్ణయించు కున్నారు.అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు.

6 ప్రత్యేక బృందాలను పంపి 8 మంది నిందిత ఆపరేటర్ల ను అరెస్ట్ చేశారు.ఈ 6 బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ప్రజలకు భారీగా నష్టాలు కలిగించి నట్లుగా సిఐడి పోలీసులు గుర్తించారు.సిఐడి చేసిన ఈ దాడుల్లో అనేక హార్డ్వేర్ పరికరాలు, వాటిలోని విస్తృతమైన డేటాను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశమున్నందున, వారి గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.

By
en-us Political News

  
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
హైదరాబాద్ నగరంలో గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్..
నాగరాజు ఉండటం వల్లే తమ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల ఆగడాలు అణచివేయబడ్డాయని, తాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసలేం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందన్న విషయంపై ప్రముఖ విశ్లేషకుడు సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్టాడారు.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం
షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ.. నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది.
సాధారణంగా పుట్టిన బిడ్డకు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే అదే సంప్రదాయాన్ని ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
టాటా మోటార్స్ (కమర్షియల్ వెహికల్స్) ఇన్వెస్టర్ డే 2026 ప్రకటనలతో షేర్ ధర 5% పెరిగి రూ. 420 కి చేరింది. జెఎమ్ ఫైనాన్షియల్, నోమురా వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్, సరికొత్త టార్గెట్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ రికవరీ, ఐటీ రంగ సవాళ్లు మరియు ఫార్మా, ఆటో యాన్సిలరీ రంగాల్లోని పెట్టుబడి అవకాశాలపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ శ్రేయాష్ దేవర్కర్ ప్రత్యేక విశ్లేషణ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.