సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధ్యాంక్స్!

Publish Date:Jun 24, 2026

Advertisement

ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.  ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై  ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో  పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును   60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో  వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును బుధవారం (జూన్ 24) కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.   సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు   లబ్ది కలుగుతోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమని వారు సీఎంకు కృతజ్ణతలు తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని ఈ సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా  సీపీఎస్, పీఎస్ యూ ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల, సొసైటీలు, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.  

By
en-us Political News

  
వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి
విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం
తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణ మరియు పునర్నిర్మాణ పనుల పూర్తి సందర్భంగా కర్ణాటకలో నిర్వహించిన సభ
దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరియు పొరుగున ఉన్న కర్ణాకటతో నదీ జలాల పంపకాల వ్యవహారం
అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన కడప బిడ్డ...
హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోంది, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన
సంచలన కేసుగా మారిన పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.