2033 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Jun 24, 2025

Advertisement

 

 

మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.


టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకన్ని సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోందని.. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ పుస్తకన్ని మహేశ్ కుమార్ గౌడ్  రచించారు. ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతున్నదన్నారు. ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ తీసుకువస్తున్నాం. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నదని సీట్లు పెరగబోతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

By
en-us Political News

  
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు.
ఆయ‌నొక మంత్రి. ఈయ‌నా మంత్రే. ఒక‌రు దేవాదాయం, మ‌రొక‌రు మున్సిప‌ల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చ‌రిత్ర గ‌లిగిన విద్యా సంస్థ‌లుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్క‌డ చ‌దువుకున్న వారే అన్న హిస్ట‌రీ సైతం క‌లిగి ఉందీ ప్రాంగ‌ణం.
దలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది. ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది.
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు.
ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది.
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.