ఆయన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. నిత్యం వివిధ కార్యక్రమాలతో, బాధ్యతలతో బిజీ బిజీగా ఉంటారు. ఊపిరి సలపని పని ఉంటుంది. ఇటు హైదరాబాద్లో, అటు సొంత నియోజకవర్గంలో అనేక ప్రొగ్రామ్స్ లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి మంత్రి ఎర్రబెల్లి.. కాస్త రిలాక్స్ అవుదామనుకున్నారు. రెబెల్ యాక్టర్ నారాయణమూర్తి రిక్వెస్ట్ తో ఆయనతో కలిసి వరంగల్లో ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. అయితే.. సినిమాకు వచ్చిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీన్ కట్ చేస్తే.. హుటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు ఎర్రబెల్లి. ఇంతకీ ఏం జరిగింది? మంత్రి అంత సడెన్ గా సినిమా హాల్ నుంచి హైదరాబాద్ కు ఎందుకు బయలు దేరాల్సి వచ్చింది? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి వరంగల్‌లోని అమృత థియేటర్‌కు వచ్చారు. సినిమా స్టార్ట్ అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌కు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. సినిమా చూడకుండానే మంత్రి ఎర్రబెల్లి అర్జెంట్‌గా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అట్నుంచి అటే హైదరాబాద్ బాట పట్టారు.
అంతకుముందు, మంత్రి ఎర్రబెల్లి, నటుడు నారాయణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. నారాయణమూర్తి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. రైతన్న సినిమాతో రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా ‘రైతన్న’ అని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-kcr-phone-call-to-minister-errabelli-when-he-was-in-theator-39-125625.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.