జగన్ రెండేళ్ళ పాలన ఏమి చేపుతోంది ?
Publish Date:May 31, 2021
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్ళు పూర్తయ్యాయి ... ఈ రెండేళ్లలో పభుత్వం ఏదైనా కొత్తగా, గొప్పగా సాధించిందా అంటే అలాంటిదీ ఏదీ లేదు.ప్రజలను మానసికంగా బిచ్చగాళ్ళను చేయడంలో మాత్రం ముఖ్యమంత్రి ముందుడుగు వేశారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు ఎదో ఒక సంక్షేమ పథకం ప్రయోజనం పొందుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి సగౌరవంగా ప్రకటించుకున్నారు. కానీ, సక్షేమ పథకాల పరిధి విస్తరణ అభివృద్ధికో, సుపరిపాలనకో సంకేతం కాదు,అది అభివృద్ధి రాహిత్యానికి నిదర్శనం. నిజమే, సంక్షేమ రాజ్యంలో, పేద ప్రజలకు సంక్షేంమ ఫలాలు అందివ్వడం, పేద ప్రజల ఆకలి తీర్చడం, వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు తీసుకుపోవడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం.అందులో మరో మాటకు,మరో అభిప్రాయానికి తావు లేదు. అయితే, సంక్షేమమే సర్వసం కాదు, కారాదు. సంక్షేమం, గీత దాటితే సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమాన ప్రధాన్యత ఇస్తూ , రెండూ రెండు కళ్ళుగా పరిపాలన సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. అలాకాదని, సంక్షేమమే సర్వస్వం అన్న రీతిలో పాలన జరిగితే అది దీర్ఘ కాలంలో అనర్ధాలకు దారి తీస్తుంది.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ‘నవరత్న’ పాలనలో జరుగుతున్నది అదే... రాష్ట్రంలో ఇప్పటికే తలకో లక్షన్నర రూపాయల అప్పు ఉందని లెక్కలు చెపుతున్నాయి. అయినా, అప్పులే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి పరిపలాన్ సాగుతోంది. కొత్తగా బడ్జెట్’లో భారీ మొత్తని అప్పుల పద్దులో చూపారు. మరోవంక దేవుని ఆస్తులు సహా ప్రభుత్వ అస్తులను అయినకాడికి అమ్ముకునేందుకు వెనకాడడం లేదు. అందితే అప్పు లేదంటే అమ్మకం అన్న రీతిగా జాన్మోహన్ రెడ్డి పళన సాగుతోంది. అందుకే ఆర్థిక వేత్తలు, ఆర్థికరంగ నిపుణులు , రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచులకు చేరిందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు., ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న వైఎస్సార్, అనర్హులకు సంక్షేమ ఫలాలు అందడం అనర్ధాలకు దారి తీస్తుందని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన ‘ఎట్లో పారేసినా ఎంచి పారేయాలనే’ సామెతను గుర్తు చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి,మాత్రం ఓట్ల వేటకు సంక్షేమమనే ముద్దు పేరు తగిలించి, ప్రజల సొమ్ముతో ప్రజల ఓట్లు కొనే, కొత్త రకం క్విట్ ప్రో సాగిస్తున్నారు. అదలా ఉంటే రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి కొత్త నిర్వచనం ఒకటి చెప్పారు. నాలుగు బిల్డింగులు కట్టడం, నాలుగు ప్రాజెక్టులు నిర్మాణం చేయడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే, నిన్నటి కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు ప్రజలు మెరుగైన జీవనం సాగిస్తున్నారా లేదా ,అనేదే అభివృద్ధికి అసలైన నిర్వచనం అని చెప్పారు. కానీ, ఆయన తమ రెడేళ్ళ పాలనపై విడుదల చేసిన పుస్తకంలో కానీ, ఆ పుస్తకం విడుదల సందర్భంగా చేసిన ప్రసంగంలో కానీ, అలాంటి వివరాల జోలికి పోలేదు, , రెండేళ్ళ పాలనలో ఇచ్చిన హామీలలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని, రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉందన్నారు. 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు.ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించ గలిగామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. చివరకు, సంక్షేమ పథకాల అమలుకు కూడా ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో వైఎసార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి చాలా ముఖ్యమైన పథకాలు . ఈమూడు పధకాల అమలుకు అవసరమయ్యే, రూ.16,890 కోట్లను ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వివిధ సంస్థల నుంచి రుణాలను సేకరిస్తోంది. ఆర్థిక పరిస్థితి ఇంత అస్తవ్యస్తంగా ఉంటే, ఇతరత్రా పరపాలన ప్రమాణాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో వేరే చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకులపైనే కాదు, సొంత పార్టీ ఎంపీ పై కూడా దేశ ద్రోహం కేసు పెట్టి,చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. కరోనా నియంత్ర, చికిత్సల విషయంలో ప్రభుత్వం చేతులేత్తేసింది. దేశంలో తగ్గుముఖమ పట్టినా,రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అవినీతి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఇందుగలదు అందు లేదు అనే సందేహం లేకుండా అన్నిటా అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక నుంచి , మద్యం వరకు అన్నిటా దోపిడీ దేదీప్యమానంగా వెలిగి పోతోంది.. అయినా ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకుని పలు తాగీ పిల్లల .. అణా బాగుంది అనే భ్రమల్లో వుంది ..
నిజమే కావచ్చును, ప్రజలజీవన ప్రమాణాలు మెరుగు పడడమే, అభివృద్ధికి అసలైన నిర్వచనం. అయితే, జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా ... తలసరి ఆదాయం పెరిగిందా.. దారిద్ర్య రేఖకు దిగువున్న ఉన్నపేదలు గీత దాటి, పేదరికం నుంచి బయట పడ్డారా ? ఈ రెండేళ్లలో పేదరికం ఎంత మేర, ఎంత శాతం తగ్గింది? ప్రభుత్వం ఇలాంటి అంశాలకు సంబంధించిన గణాంకాలను ప్రజల ముందుంచి, ఇదీ రెండేళ్లలో సాధించిన ప్రగతి అని చెప్పుంటే, అది విన సొంపుగా ఉండేది.
http://www.teluguone.com/news/content/cm-jagan-two-years-rule-increased-state-problems-25-116631.html





